'పోకిరి' కాంబినేషన్ (పూరీ, మహేష్) మళ్ళీ వస్తోంది
పూరీ జగన్నాధ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చి తెలుగు చలన చిత్ర రికార్డులను బ్రద్దలు కొట్టిన చిత్రం "పోకిరి". అయితే ఆ తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాలేదు. మహేష్ మూడు సంవత్సరాలుకు ఒక సినిమా చేయటం, పూరీ జగన్నాధ్ వరస ఫ్లాపుల్లో ఉండటం దీనికి కారణమైంది. అయితే మహేష్ తాజాగా తన వర్కింగ్ స్టైల్ ని మార్చుకుని వరస సినిమాలను కమిటవుతున్నాడు. ఈ క్రమంలో పూరీ చెప్పిన స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అయి 2011 మార్చి నుంచి డేట్స్ కేటాయిస్తానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో పూరి స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుతున్నారు. అలాగే తెలుగులో పేరున్న ఓ నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మించటానికి ముందుకొచ్చింది. మరో ప్రక్క పూరీ జన్నాధ్...రాణా హీరోగా నేనూ...నా రాక్షసి చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు...దూకుడు(శ్రీను వైట్ల దర్శకత్వం)చిత్రం, శంకర్ తో త్రీ ఇడియట్స్ రీమేక్, లింగుస్వామి దర్సకత్వంలో వేట చిత్రాలు ఇప్పటికే కమిటయ్యి ఉన్నారు.


Click it and Unblock the Notifications











