ది రాజా సాబ్‌ కోసం ప్రభాస్‌‌కి రికార్డ్ రెమ్యునరేషన్.. రెబల్ స్టార్ పారితోషికం ఎన్ని కోట్లంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ది రాజా సాబ్. యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా ఉన్న ప్రభాస్‌.. తిరిగి వింటేజ్ ప్రభాస్‌గా మారేందుకు చేసిన ప్రయోగమే ఈ సినిమా. హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజా సాబ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు ప్రభాస్ పారితోషికం ఎంత? అలాగే దర్శకుడు మారుతి.. హీరోయిన్లు, ఇతర నటీనటులు ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివరాల్లోకి వెళితే..

ది రాజా సాబ్ తారాగణం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ది రాజా సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

The Raja Saab fees Prabhas Remuneration and Other Cast Salaries Complete Details

ది రాజా సాబ్ బడ్జెట్ ఎంత?
ది రాజా సాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా... కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ది రాజా సాబ్‌ను దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాలో ఎవరెంత ఛార్జ్ చేశారు? ప్రభాస్, సంజయ్ దత్‌లకి ఎంత? అందరిలోకి టాప్ ఎవరు? అనేది పరిశీలిస్తే..

ప్రభాస్‌కి రికార్డ్ రెమ్యునరేషన్?
ది రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోవడంతో సినిమాకు దాదాపు 150 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు డార్లింగ్. అలాంటి దశలో ఆయన జోరుకు ఆదిపురుష్ బ్రేక్ వేసింది. దాంతో తన రెమ్యునరేషన్‌ను 100 కోట్ల రూపాయలకు తగ్గించారని అంటున్నారు. అయితే ఆదిపురుష్‌కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొన్ని ఏరియాలలో పంపిణీదారుగా వ్యవహరించి భారీ నష్టాలను ఎదుర్కొంది. దాంతో ఈ సంస్థను ఆర్ధికంగా ఆదుకునేందుకు గాను ప్రభాస్ తన రెమ్యునరేషన్‌ను తగ్గించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజా సాబ్‌ నటీనటుల రెమ్యునరేషన్
ఇక ప్రభాస్ తర్వాత దర్శకుడు మారుతి పారితోషికం అందుకున్నట్లు టాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజా సాబ్ కోసం మారుతికి 18 కోట్ల రూపాయలు దక్కినట్లు తెలుస్తుంది. ఆయన తర్వాత సంజయ్ దత్ 6 కోట్ల రూపాయలు, బొమన్ ఇరానీ 2 కోట్ల రూపాయలు, మాళవిక మోహనన్ 2 కోట్ల రూపాయలు, రిద్ధి కుమార్ 3 కోట్ల రూపాయలు, నిధి అగర్వాల్ 1.5 కోట్ల రూపాయలు చొప్పున పారితోషికం అందుకున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: the raja saab prabhas maruthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X