The Raja Saab OTT Rights : ది రాజ్ సాబ్ రికార్డ్.. ఓటీటీ రైట్స్ కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ది రాజాసాబ్. డార్లింగ్ ప్రభాస్ భారీ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన అభిమానుల కోసం కామెడీ, లవ్, రొమాంటిక్ చిత్రం కూడా చేయాలని తలిచారు. దీంతో డైరెక్టర్ మారుతీతో కలిసి 'ది రాజా సాబ్' చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు బెస్ట్ అవుట్ పుట్ కోసం టాప్ టెక్నీషియన్లతో కలిసి పనిచేస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ క్రమంలో సినిమా బిజినెస్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతున్నాయి.

భారీ బడ్జెట్ తో ది రాజా సాబ్..
ది రాజాసాబ్ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. తొలుత ఈ చిత్రం మీడియం రేంజ్ బడ్జెట్ గా మొదలైంది. కానీ రాను రాను సినిమా స్థాయి పెరుగుతూ వచ్చింది. చిత్రంలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ముగ్గురు స్టార్ హీరోయిన్లు నటించడం, టాప్ టెక్నీషియన్లు నటించడం, భారీ సెట్లను నిర్మించడంతో సినిమాకు భారీగానే ఖర్చైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం. దీంతో ఈ సినిమా అవుట్ పుట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

The Raja Saab OTT Rights

ది రాజా సాబ్ ఓటీటీ..
ది రాజా సాబ్ చిత్రం విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. మరో 5 నెలల వరకు వేచి ఉండాల్సిందే. అయితే ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. దీంతో సినిమాకు సంబంధించిన రైట్స్ ను దక్కించుకునేందుకు డిస్ట్రీబ్యూటర్స్, ఓటీటీ సంస్థ, టెలివిజన్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ది రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు సంబంధించిన వివరాలు అందాయి.

ఈ హక్కులను దక్కించుకునేందుకు పలు సంస్థలు రూ.180 కోట్ల నుంచి రూ.210 కోట్ల వరకు ఆఫర్ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో ది రాజా సాబ్ చిత్రానికి రికార్డ్ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగబోతుందని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఆడియో రైట్స్ ను టీ-సీరిస్ సంస్థ దక్కించుకుంది. ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను ఏ సంస్థలు సొంతం చేసుకుంటాయోనన్నది వేడి చూడాలి.

శరవేగంగా ది రాజాసాబ్..
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రాజా సాబ్ చిత్రం పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళిని దాటేసి డిసెంబర్ 5న విడుదల తేదీని ఖాయం చేసుకుంది. ఇంత ఆలస్యానికి కారణం బెస్ట్ అవుట్ పుట్ అని మేకర్స్ బదులిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, యోగి బాబు, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి నటులు కూడా పలు పాత్రల్లో అలరించబోతున్నారు.

More from Filmibeat

Read more about: the raja saab prabhas ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X