The Raja Saab: రికార్డ్ ధరకు రాజా సాబ్ హిందీ రైట్స్.. ప్రభాస్ మూవీ ఓటీటీ హక్కులకు ఎన్ని కోట్లంటే?

కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీలు ప్రేక్షకులకు సినిమాలు చూడటంలో సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఓటీటీల ద్వారా నిర్మాతలకు అదనపు ఆదాయాలతో పాటు నష్టాలను పూడ్చుకునే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం కలెక్షన్స్ రికార్డులతో పాటు ఓటీటీ డీల్స్, ఓటీటీలో వ్యూస్, టాప్ ట్రెండింగ్ ఇలా ఓటీటీలు కూడా కొత్త రికార్డులను అందిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల ఓటీటీ రైట్స్, వాటి లెక్కలు కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ది రాజా సాబ్ మూవీ ఓటీటీ రైట్స్ రికార్డుల్ని బ్రేక్ చేస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

వింటేజ్ లుక్‌లో ప్రభాస్
గడిచిన కొన్నేళ్లుగా యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్లు చేస్తూ వచ్చిన డార్లింగ్.. ఈసారి ఈ రోటీన్ ఫార్మూలాకు బ్రేక్ చెప్పారు. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలతో వింటేజ్ ప్రభాస్‌ను బయటికి తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ మారుతితో చేస్తున్న మూవీ .. ది రాజా సాబ్. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇటీవల విడుదలైన టీజర్ దీనిని మరింత పెంచేసింది. తొలుత మీడియం రేంజ్ సినిమాగా మొదలైన ఈ చిత్రం రాను రాను భారీ బడ్జెట్‌ మూవీగా మారింది.

The Raja Saab OTT Rights Netflix Offered Huge for Prabhas s Movie Hindi Ott Deal

ది రాజా సాబ్ బడ్జెట్ ఎంత?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు.. ది రాజా సాబ్ చిత్రాన్ని దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, బ్రహ్మనందం, వీటీవీ గణేష్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

కళ్లు చెదిరేలా ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్
ప్రభాస్ మార్కెట్ నేపథ్యంలో ది రాజా సాబ్ సెట్స్ మీద ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఆంధ్రా, నైజాం, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. అటు ఓటీటీ రైట్స్ కోసం దిగ్గజ కంపెనీలు పోటీపడుతున్నాయి. ది రాజా సాబ్ బిజినెస్‌కు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

రికార్డు ధరకు హిందీ ఓటీటీ రైట్స్
ది రాజా సాబ్ ఓటీటీ రైట్స్‌ను హిందీకి, దక్షిణాది భాషలకు వేర్వేరుగా డీల్ కుదుర్చుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ది రాజా సాబ్ హిందీ రైట్స్‌‌కు రికార్డు ధర పలికినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు పైగా వెచ్చించి ది రాజా సాబ్ హిందీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందట. ఓటీటీ రైట్స్ విషయంలో ఇది అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు.

హిందీకే పరిస్ధితి ఇలా ఉంటే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ది రాజా సాబ్ ఓటీటీ రైట్స్ ఇంకెంత పలుకుతాయోనని ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ సినిమా దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: the raja saab netflix prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X