నాగార్జున 'మోసగాడు' వెనక అసలు కథ ఇదే!?
నాగార్జున తాజాగా చేస్తున్న చిత్రం టైటిల్ రమ్మీ టైటిల్ తనదేనంటూ ఓ చిన్న నిర్మాత కేసు పెట్టారని తెలుస్తోంది. ఆ సినిమా సగం షూటింగ్ జరిగి ఆగిపోయింది. అయితే తాను దానిని పూర్తి చేస్తానని, కాబట్టి తనకే ఆ టైటిల్ తనకే చెందాలనేది ఆ నిర్మాత వాదన. ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేసుకున్న దానిని తనకు తెలియకుండా ఎలా ప్రచారంలోకి తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించినట్లు ఫిల్మ్ వర్గాల్లో వినపడుతోంది. అయితే కామాక్షి మూవీస్ అధినేత మాత్రం ఇంత పాపులైజ్ చేసిన తర్వాత టైటిల్ మారిస్తే కన్ఫూజన్ ఏర్పడే సమస్య ఉందని భావిస్తున్నారు. దాంతో మొదట రిజిస్ట్రేషన్ చేసిన నిర్మతను అడిగి సామరస్యపూర్వకంగా సెటిల్ చేసుకునే యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఫోన్స్, రాయబారాలు జరుగుతున్నాయిని చెప్తున్నారు. కొందరు సినీ పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ఈ రాజీ సూచనే మేలని చెప్పారని అంటున్నారు. అంటే మళ్ళీ నాగార్జున చిత్రానికి రమ్మీ టైటిల్ రావచ్చు అన్నమాట. విదేశాలకు పాటలకు షూటింగ్ కు వెళ్ళే లోపలే ఈ మ్యాటర్ సెటిల్ చేద్దామని అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన మమతామోహన్ దాస్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











