మణిరత్నం రావణ్(విలన్) కథ కరెక్టుగా ఇదే...
పోలీస్ ఆఫీసర్ దేవ్‌ప్రసాద్ (పృధ్వీ) క్లాసికల్ డాన్సర్ రాగిణి(ఐశ్వర్య రాయ్)తో ప్రేమలో పడి పెళ్ళిచేసుకుంటాడు. ఆతర్వాత ట్రాన్సఫరై నార్త్ ఇండియా లోని లాల్ మిట్టా అనే చిన్న టౌన్ కి వెళ్ళతారు. అక్కడ పోలీస్ వ్యవస్ధ అనేది నామమాత్రంగా పనిచేస్తూంటుంది. ఆ ఊరిలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూంటాడు వీరయ్య అలియాస్ వీరా(విక్రమ్). వీరయ్య ఓ గిరిజనుడు. అక్కడ పరిస్ధితులు గమనించిన దేవ్ ..అక్కడ వారి నాయకుడు వీరాని మట్టుపెడ్తే సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని భావించి..పోరాటం ప్రారంభిస్తాడు. వీరా..మనిషి ప్రియమణి దేవ్ ప్రసాద్ చేతిలో మరణిస్తుంది. దెబ్బ తిన్న వీరా...దేవ్ భార్య రాగిణిని తీసుకుని అడవిలోకి పారిపోతాడు. ఆమెని వెతుక్కుంటూ దేవ్ బయిలుదేరతాడు. ఆ అడవి చాలా కన్ఫూజింగ్ గా భయపెట్టదిగా, దట్టంగా ఉంటుంది. ఆ క్రమంలో రకరకాల సంఘటనలు ఎదుర్కోవాల్సివస్తుంది. అతనికి త్రాగుబోతు పారెస్ట్ గార్డు (గోవిందా) సాయిపడతాడు. ఎదురైన పరిస్థితులు ఏమిటనేవి ఈ చిత్రంలోని ప్రధానాంశం. వీరాగా విక్రమ్, దేవ్ గా పృథ్వీరాజ్, రాగిణిగా ఐశ్వర్య నటించిన ఈ చిత్రంలో ప్రియమణి, ప్రభు, కార్తీక్ కీలక పాత్రలను పోషించారు. మద్రాస్ టాకీస్ పతాకంపై నిర్మాణమైన 'విలన్' చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











