Balayya: అప్పుడు రాధికా అప్టే.. ఇప్పుడు విచిత్ర.. నిజంగానే బాలకృష్ణ హీరోయిన్లను టార్చర్ చేశాడా?
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కు గురైన హీరోయిన్లు, నటులు ఎంతో మంది ఉన్నారు. కానీ దాన్ని బయటపెట్టే ధైర్యం చాలా మందికి తక్కువ. అయితే ఇప్పుడు తమిళ బిగ్ బాస్ బ్యూటీ విచిత్ర చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ హీరో బాలకృష్ణ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బాలయ్యపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. రాధిక ఆప్టే కూడా తనను ఓ తెలుగు హీరో వేధించాడు అంటూ అప్పట్లో చెప్పుకు వచ్చింది. ఆ ఆరోపణలు బాలయ్యే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే నిజంగా బాలయ్య హీరోయిన్లను టార్చర్ చేశాడా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తమిళ బిగ్ బాస్ బ్యూటీ విచిత్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ తనను ఓ హీరో ఇబ్బంది పెట్టాడు అంటూ బిగ్ బాస్ షోలో కొన్ని ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. అయితే తమిళ్ హీరో కాదు... అని చెప్పింది తప్ప.. తెలుగు హీరో అని వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ హీరో బాలకృష్ణ అంటూ ప్రచారం జరగుతుంది. ఆమె తెలుగులో నటించిన చిత్రం బాలయ్యది కావడం వల్ల ఆ ప్రచారం మరింత ఊపు అందుకుంది.

నిజానికి ఆమె చెప్పింది కేవలం తమిళ హీరో కాదు.. అని.. అయితే ఏ భాష హీరో అనేది వెల్లడించలేదు... అంతే కాదు సినిమా పేరు చెప్పకుండా.. ఒక 20,23 సంవత్సరాల క్రితం నేను స్టార్ హీరో వల్ల ఎన్నో వేధింపులకు గురయ్యాను అంటూ చెప్పుకువచ్చింది. అడవుల్లో షూటింగ్ అంటూ చెప్పుకురావడంతో.. బాలయ్య నటించిన భలేవాడివి బాసు చిత్రం అడవుల్లోషూటింగ్ జరుపుకుంది. ఇక అందరూ అదే సినిమా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్యపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే కూడా ఓ సౌత్ హీరో తనను ఇబ్బంది పెట్టాడంటూ బయటపెట్టింది. అయితే ఈ హీరోయిన్ తెలుగులో బాలకృష్ణతో కలిసి లెజెండ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా బాలయ్యనే అంతా అనుకున్నారు. బాలయ్య హీరోయిన్లను టార్చర్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు.
అయితే బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. భోళా శంకరుడి లాంటి మనసు.. లోపల ఏది పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. అయితే ఆయన మీద యాంటి ఫ్యాన్స్ ఇలా ప్రచారం చేస్తున్నారంటూ బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. కొంత మంది ఫేమ్ కోసం.. ఫేమస్ అయ్యేందుకు డ్రామా కూడా ఆడొచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ లో విచిత్ర కొనసాగాలంటే.. ఆమెకు సింపతి గెయిన్ కావాలి.

ఈ నేపథ్యంలోనే ఆమె తన గత అనుభవాలను ఇలా షేర్ చేసుకుని సింపతీ గెయిన్ చేస్తుందని మరికొంత మంది అంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు బాలకృష్ణ యాంటి ఫ్యాన్స్ ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారని బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిజంగా ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.. ఈ విషయంపై బాలయ్య స్పందిస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











