»   » దర్శకుడి కాళ్ళవేళ్ళ పై పడుతున్న అసిన్!

దర్శకుడి కాళ్ళవేళ్ళ పై పడుతున్న అసిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అవకాశాలు దొరక్క, దక్షిణాదికి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీగా వున్న అసిన్, పైకి మాత్రం 'బాలీవుడ్ లో నాకు బాగానే వుంది" అంటూ కబుర్లు చెప్తోంది. 'గజిని", 'లండన్ డ్రీమ్స్" మినహాయిస్తే, అసిన్ కి బాలీవుడ్ లో అవకాశాలు దక్కడమే గగనమైపోయింది. ఇకపై తెలుగు సినిమాలు చేయను..బాలీవుడ్ పైనే దృష్టింతా పెడతాను అని ఫోజులిచ్చిన అసిన్ మళ్లీ దక్షిణాదిన మంచి సినిమా వస్తే చేస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే..

అసలు ఆమె అలా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా! బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన ఈ భామకు తర్వాత ఒక్క సినిమా ఛాన్స్ కూడా రావడం లేదట.. అందుకే మళ్ళీ రివర్స్ గేర్ వేసి టాలీవుడ్ వైపు అడుగు పెట్టాలనుకుంటుంది. అసిన్ గజినితో...చాలా ఎత్తుకు ఎదిగి, నేలను మర్చిన భామకు బాలీవుడ్ దర్శకనిర్మాతలు మంచి ఝలక్ ఇవ్వడంతో..ఇంకా అక్కడ ఉండి లాభం లేదని అనుకుందట...అసిన్...వెంటనే.. తనకు బాలీవుడ్ స్థానాన్ని కల్పించిన దర్శకుడు మురగదాస్ ను వెతికి మరీ పట్టుకుని టాలీవుడ్ లో ఓ మంచి చిత్రంలో నటించే అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నదని సమాచారం.

ముందు బిల్డప్స్ ఇవ్వడం ఎందుకు తర్వాత బతిమలాడు కోవడం ఎందుకు అంటూ అసిన్ పై మాటలు విసురుతున్నారు. విమర్శకులు. ఇప్పటికైనా తెలుసుకుని నేలవైపు చూస్తున్నాందుకు అసిన్ ను అభినందిస్తున్నారు. విమర్శకులు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu