బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్.. రవితేజ మొదలుపెట్టేది అప్పుడే!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఉన్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం గురించి తాజాగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెల్ళబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలోని అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక తేరి రీమేక్ మొదలు పెట్టాలని రవితేజ భావిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఆ మధ్యన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు ప్రచారం జరిగాయి. ఈ ఊహాగానాలకు తెర పడాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రావాలి. సంతోష్ శ్రీనివాస్ తేరి కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి రెడీగా ఉన్నాడట. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.


Click it and Unblock the Notifications











