Allu Arjun : అల్లు అర్జున్‌పై ఈ హీరోల కోపం చల్లారలేదా? ..ఇంత జరిగినా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్ద ఫ్యామిలీలలో మెగా కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల కష్టంతో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అలాగే ఆయన తన వారసులను ఎంతో క్రమశిక్షణతో పెంచి ప్రయోజకులను చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీరు మళ్ళీ కలుస్తారు అనేలా కుటుంబాన్ని తయారు చేసుకున్నారు అని ఇండస్ట్రీ వర్గాలే ప్రశంసిస్తుంటాయి.

అయితే కుటుంబంలో అన్నాక ఏవోక అంశాల్లో చిన్న చిన్న పొరపత్యాలు, అభిప్రాయ భేదాలు తప్పకుండా ఉంటాయి. అలాగే మెగా కుటుంబంలోనూ ఇవి లేకపోలేవు. అక్కడి దాకా ఎందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల నడుమే రాజకీయపరంగా పలు అభిప్రాయ భేదాలు రావడంతో పవన్ కొన్నాళ్ళు అన్నయ్యకి దూరంగా ఉన్నాడు. కానీ తను పార్టీ పెట్టి గెలుపొందిన తర్వాత తన అఖండ విజయాన్ని తీసుకెళ్లి అన్నయ్య కాళ్ళ దగ్గర తెచ్చి పెట్టాడు.

these mega heroes insecure with allu arjun craze

ఇదొక ట్రాక్ అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్రాక్ ఇంకొకటి అని చెప్పాలి. గతంలో అల్లు అర్జున్ తన కెరీర్ కి మెగా బ్రాండ్ నే జపం తీసుకుంటూ వచ్చాడని మెగా ఫ్యాన్స్ అంటుంటారు. కానీ నెమ్మదిగా పరిస్థితులు మారడంతో మెగా ఫ్యామిలీకి దూరం అవ్వడం స్టార్ట్ చేసాడు. కానీ మేనమామ చిరంజీవి పట్ల మాత్రం ప్రేమ అలానే ఉంది. కానీ మెగా ఫ్యాన్స్‌లో కొందరు బన్నీ ప్రతీ ఈవెంట్‌లో చేసే హంగామాతో చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మధ్యలో ఈ గొడవ సర్దుమణిగింది. కానీ మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మాత్రం అల్లు అర్జున్ చేసిన పని ఒక మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాదు మెగా హీరోస్‌లో కూడా కొందరికి నచ్చలేదు అనే టాక్ ఇండస్ట్రీలో గుప్పుమంది. కానీ ఇపుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో మెగా హీరోస్‌ని మించి బిగ్ స్టార్ అయ్యి కూర్చున్నాడు. దీంతో అల్లు అర్జున్ అంటే వారికి పడట్లేదా ? తన క్రేజ్‌ను చూసి అసూయ పడుతున్నారా అనే టాక్ ఉంది.

అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలోనూ ఇది మరింత ప్రూవ్ అయ్యిందని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బన్నీ అరెస్ట్ విషయంలో కానీ , తాను విడుదలై వచ్చాక కానీ, మెగా హీరోస్ ముగ్గురు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు కనీసం సోషల్ మీడియాలోనూ చిన్న పోస్ట్ పెట్టలేదు.

ఇంట్రెస్టింగ్ గా నిన్న అల్లు అర్జున్ రిలీజ్ అయ్యిన రోజే రామ్ చరణ్ ఏమో రానాకి బర్త్ డే విషెస్ చెప్పాడు. వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ లు ఓ సినిమా కోసం సరదాగా మాట్లాడుకోవడం చేశారు తప్ప బన్నీ కోసం ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. దీనితో మెగా వర్సెస్ అల్లు విభేదాలు ఈ రేంజ్‌లో ఉన్నాయో అనే అనుమానాలు బలపడుతున్నాయి. 'మట్కా' ప్రీ రిలీజ్ లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్, ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో కొట్టడం వంటివి పెద్ద చర్చకి దారి తీశాయి. దీనితో ఈ టాక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X