Devara Pre Release Event : ఎన్టీఆర్ కోసం ఆ ముగ్గురు.. ఫ్యాన్స్‌ని ఆపగలరా !!

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్‌లు ముంబై, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాల్లో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దేవర‌కు సీబీఎఫ్‌సీ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రన్ టైమ్ విషయానికి వస్తే 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్ , నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో లాంచ్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

These Tollywood Stars to share Stage with Jr NTR for Devara Pre Release Event here s the details

మేకర్స్ ప్రమోషన్స్‌కు తోడు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దేవర రికార్డులు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారా అప్పుడే 1 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా దేవర చరిత్ర సృష్టించింది. తాజాగా పాన్ ఇండియా సినిమాల పరంగా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డులను దేవర బద్ధలుకొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

వచ్చే వారం సినిమా రిలీజ్ కానుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాకు మంచి హైప్ తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని నోవాటెల్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని టాలీవుడ్ టాక్. తొలుత ఈ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని అనుకున్నా.. విజయవాడలో వరదల నేపథ్యంలో వేదిక హైదరాబాద్‌కు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబులు చీఫ్ గెస్ట్‌లుగా రానున్నట్లుగా తొలుత ప్రచారం జరిగింది.

అయితే గెస్ట్‌లు మారినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్‌ నీల్‌లు ఈ ఈవెంట్‌కు వస్తారని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. జక్కన్న, త్రివిక్రమ్‌లతో ఎన్టీఆర్‌కున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవర తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. జూనియర్ కోసం ఈ కేజీఎఫ్ మేకర్ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంత్ ఉంటున్నాడు. ఈ ముగ్గురూ ఖచ్చితంగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తారని మెజారిటీ సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు. లాస్ట్‌ మినిట్‌లో గెస్టులు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి దేవర విషయంలో ఏం జరుగుతుందో తెయాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: jr ntr devara ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X