2024లో పెళ్లి చేసుకోబోయే టాలీవుడ్ టాప్ హీరోయిన్లు వీళ్లే.. క్యూ పెద్దగానే ఉందిగా!
2023లో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు. తమకు నచ్చిన వాళ్లను పెళ్లాడి ఓ ఇంటి వాళ్లు అయ్యారు. అయితే 2024లో కూడా అదే రిపీట్ కాబోతుంది. చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. అందులోనూ తాము ప్రేమించిన వారి చేతే మూడు ముళ్లు వేయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. అయితే ఆ హీరోయిన్లు ఎవరు, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఈ ఏడాది పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయినట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తమన్నా కుటుంబ సభ్యులు అంతా ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని తెగ ఒత్తిడి చేస్తున్నారట. దీంతో ఆమె కచ్చితంగా 2024లో పెళ్లి చేసుకుందామని ప్రియుడికి చెప్పగా అతడు కూడా ఓకే అన్నాడట. త్వరలోనే వీరు ఈ విషయం గురించి అదికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా 2024లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ఈమె ప్రేమలో ఉండగా... ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయిందని ఫిబ్రవరి 22వ తేదీన ఒక్కటి కాబోతున్నారని.. అందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

అచ్చమైన హైదరాబాద్ అమ్మాయి అదితీ రావు హైదరి, హీరో సిద్దార్థ్ తో ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ జంట కూడా ఈ ఏడాదే పెళ్లి ప్రయాణం ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అలాగే శృతి హాసన్ కూడా తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రేమ విషయం గురించి అధికారికంగా ప్రకటించేసిన ఈమె.. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే కచ్చితంగా చెబుతానని క్లారిటీ ఇచ్చింది.

మరోవైపు విరూపాక్ష సినిమాలో నటించి విపరీతంగా భయపెట్టిన నటి సంయుక్తా మీనన్ కూడా పెళ్లికి సిద్ధం అయినట్లు సమాచారం. అందుకే ఆమె ఎలాంటి సినిమాలకు ఓకే చెప్పట్లేదని.. పెళ్లి అయ్యాకే కెరియర్ ను కొనసాగించనుందని తెలుస్తోంది. భీమ్లా నాయక్ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేసిన ఈమెకు చాలా ఆఫర్లే వస్తున్నా పెళ్లి కోసమే వాటిని తిరస్కరిస్తోందట. చూడాలి మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందనేది.


Click it and Unblock the Notifications











