Unstoppable Season 4 : బాలయ్య షోకి గెస్ట్‌లుగా సీఎం, డిప్యూటీ సీఎం.. దెబ్బకు థింకింగ్ మారిపోవాల్సిందే!

తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాను పోటీలో నిలబెట్టి.. ఇండియా వైడ్‌గా క్రేజ్ తీసుకొచ్చిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. నటసింహం నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించిన ఈ అల్టిమేట్ టాక్ షో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాగే ఐఎండీబీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో, రీజినల్ లాంగ్వేజ్ కేటగిరీలో నెంబర్ వన్‌గా నిలిచింది అన్‌స్టాపబుల్. ఇప్పటికీ మూడు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ మెగా షో రీసెంట్‌గా సీజన్ 4ని గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. ఈ నేపథ్యంలో లాంచింగ్ ఎపిసోడ్‌కు ఎవరు గెస్ట్‌గా వస్తున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ వివరాల్లోకి వెళితే :

హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలన్న అల్లు అరవింద్ ప్లాన్ అన్ని రకాలుగా వర్కవుట్ అయి ఆహాకు పెద్ద వరమైంది. బాలయ్య తన టైమింగ్, ఆట పాటలతో అన్‌స్టాపబుల్‌ను బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టారు. గెస్ట్‌లతో చేసే అల్లరి, టాస్క్‌లతో హోస్ట్‌గా సక్సెస్ కొట్టారు బాలయ్య.. ఇప్పటి వరకు మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు గాడ్ ఆఫ్ మాసెస్. ఈ షోకు పవన్ కళ్యాణ్ , మహేశ్ బాబు, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని , శర్వానంద్, గోపీచంద్ సహా పలువురు హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు హాజరై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

these Two Politicians to participate nandamuri Balakrishna s unstoppable Season 4 in aha ott

ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 3 మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఏకంగా టీడీపీ అధినేత, ఇప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను ఈ షోకు తీసుకొచ్చి వారిని ఫన్నీగా ఇంటర్వ్యూ చేశారు బాలయ్య. ఎప్పుడు రాజకీయాలతో సీరియస్‌గా ఉండే చంద్రబాబులోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 కోసం ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దసరా సందర్భంగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్‌ను గ్రాండ్ లాంచ్ చేసింది ఆహా టీమ్.

ఇంత వరకు ఎప్పుడూ చూడని విధంగా బాలకృష్ణను సూపర్‌ హీరోగా ప్రజెంట్ చేశారు అల్లు అరవింద్. అక్టోబర్ 24 నుంచి అన్‌స్టాపబుల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతుందని ఆహా టీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇంతకీ ఈ సీజన్‌కు గెస్ట్‌లుగా ఎవరు రానున్నారు.. అన్నింటికి మించి సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌లో బాలయ్యతో వేదిక పంచుకునేది ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.

these Two Politicians to participate nandamuri Balakrishna s unstoppable Season 4 in aha ott

సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి , అల్లు అర్జున్, రామ్ చరణ్ హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ వీరెవరు కాదంటూ నెటిజన్లు మరో బాంబు పేల్చారు. బాలయ్య బావ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా వస్తారని ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన పనులను ఈ ఫ్లాట్‌ఫాం ద్వారా వివరిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. సోషల్ మీడియాలో అయితే ఈ ఇష్యూపై తెగ డిస్కషన్ జరుగుతుండగా.. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ చంద్రబాబు, పవన్ వస్తే మాత్రం అదిరిపోయేలా క్వశ్చన్స్ ఉంటాయని ఫిలింనగర్ టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X