ఒక్క నిమిషానికి కోటి రూపాయలు.. ఆ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా!
ప్రస్తుత కాలంలో అందమైన ముద్దుగుమ్మల హవా ఎక్కువ నడుస్తోంది. ఇంతకుముందు హీరోయిన్ల కంటే హీరోలకు పారితోషికం అధికంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కాస్తా మారింది. అంటే హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోకున్నా.. కేవలం అలా తళుక్కుమని మెరిసినందుకే కోట్లల్లో సంపాదిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం ఫుల్ మూవీకి 2, 3 కోట్లు తీసుకుంటే ఈ ముద్దుగుమ్మ మాత్రం కేవలం ఒకే ఒక్క నిమిషానికి రూ. కోటి తీసుకుని ఆశ్చర్యపరిచింది. మరి ఆ లక్కీ హీరోయిన్ ఎవరనే విషయంలోకి వెళితే..
ఇండియా తరఫున:ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్న బాలీవుడ్ హాట్ బ్యూటి ఊర్వశి రౌతేలా. ఇటీవల ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ చేస్తూ వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఉత్తరాఖండ్ లోని హిరిద్వార్ కు చెందిన ఊర్వశి రౌతేలా మిస్ దివా 2015తోపాటు అనేక అందాల పోటీల్లో రాణించింది. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించింది.

బోల్డ్ క్యారెక్టర్స్:అందాల పోటీ తర్వాత హాట్ బ్యూటి ఊర్వశి.. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, పాగల్ పంతి, వర్జిన్ భానుప్రియ వంటి చిత్రాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసి అలరించింది. అలాగే హనీ సింగ్, గురు రంధవా వంటి పాపులర్ సింగర్స్ మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది.

సేవా కార్యక్రమాలు:సినిమాలతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఊర్వశి రౌతేలా స్మైల్ ఫౌండేషన్, సేవ్ ది చిల్డ్రన్ వంటి సంస్థలతో పని చేసింది. ఇక ఇదిలా ఉంటే తన అందచందాలతో ఆకట్టుకునే ఊర్వశి ఐటమ్ గర్ల్ గా తెలుగులో సూపర్ క్రేజ్ అందుకుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో బాసు వేరీజ్ ది పార్టీ అంటూ చిందులేసిన ఈ భామ రూ. 2 కోట్లు వసూలు చేసినట్లు టాక్.

బ్రో సినిమాలో:వాల్తేరు వీరయ్యలో ఊర్వశి సాంగ్ హిట్ కావడంతో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. ఏజెంట్ సినిమాలో వైల్డ్ సాలా అంటూ స్టెప్పులు వేసింది. తాజాగా పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో సితార మంజరిగా ఆకట్టుకుంది బాలీవుడ్ హాట్ బ్యూటి ఊర్వశి రౌతేలా.

రూ. 3 కోట్లు:ఇదిలా ఉంటే వీటన్నింటికంటే భారీ రెమ్యునరేషన్ వచ్చే ఛాన్స్ కొట్టేసిందట ఊర్వశి రౌతేలా. బోయపాటి శ్రీను-రామ్ పోతినేని స్కంద సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనుందట ఈ వయ్యారి. ఇందులో స్పెషల్ సాంగ్ లో 3 నిమిషాలు కనిపించేందుకు ఏకంగా రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో నిమిషానికి రూ. కోటి చొప్పున వసూలు చేస్తోన్న ఊర్వశి క్రేజ్ మాములుగా లేదుగా అనుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియరావాలి.


Click it and Unblock the Notifications











