Spirit: ప్రభాస్‌తో బాలీవుడ్ టాప్ బ్యూటీ? స్పిరిట్ మూవీ కోసం భారీ ఆఫర్!

ప్రెజెంట్ ఇండియన్ సినిమా దగ్గర భారీ మార్కెట్ ఉన్న టాలీవుడ్ హీరోస్ లో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరని తెలిసిందే. కాగా పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ చేస్తున్న ఒకో సినిమా భారీ వసూళ్లు అందుకుంటుంది. దీనితో అంతకంతకు ప్రభాస్ సినిమాల లైనప్ కూడా పెరుగుతూ వస్తుంది.

ఈ ఏడాదిలోనే కల్కి 2898 ఎడి అనే సినిమాతో పలకరించిన ప్రభాస్ ఈ సినిమా తర్వాత పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాల్లో ఊహించని అంచనాలు ఉన్న సోలో సినిమా మాత్రం "స్పిరిట్" అని చెప్పొచ్చు. కాగా ఆల్రెడీ ప్రభాస్ నుంచి పలు సీక్వెల్ సినిమాలు ఉన్నాయి.

this bollywood beauty to share screen prabhas with another film

వాటి హైప్ వేరే లెవెల్ కానీ వాటిని మించి హైప్ మాత్రం ఈ ఒక్క సినిమాపై ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఈ చిత్రాన్ని మెంటల్ మాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరక్కిస్తుండగా ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయి. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఆసియ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా గ్రాండ్ తారాగణం కూడా కనిపించనున్నారు.

ఇలా బాలీవుడ్ నుంచి కూడ పలువురు స్టార్స్ కనిపిస్తారని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. కాగా మొదటగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ పేరు వినిపించింది. కానీ తర్వాత ఆ రూమర్స్ కి చెక్ పెట్టి కరీనా తాను ఆ సినిమాలో లేను కానీ క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ తో ఆల్రెడీ నటించిన ఓ బాలీవుడ్ బ్యూటీ కనిపించనుందట.

ఇపుడు వరకు ప్రభాస్ సినిమాల్లో శ్రద్దా దాస్, దీపికా పదుకొనె లాంటి బిగ్ స్టార్స్ కనిపించారు. కాగా ఈ ఇద్దరిలో దీపికా స్పిరిట్ లో కనిపించే ఛాన్స్ ఉన్నట్టుగా పలు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు కలిసి నటించిన రీసెంట్ సినిమానే "కల్కి 2898 ఎడి". ఈ సినిమాలో దీపికా హీరోయిన్ అని చెప్పలేం కానీ ప్రభాస్ తో కలిసి కీలక పాత్రలో ట్రావెల్ చేశారు.

this bollywood beauty to share screen prabhas with another film

కానీ ఇపుడు స్పిరిట్ కి అయితే హీరోయిన్ గానే అన్నట్టుగా వినిపిస్తుంది. మరి ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజముందో చూడాలి. దీపికా రీసెంట్ గానే తల్లి కూడా అయ్యిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ఫ్యామిలీతోనే బిజీగా ఉంది. అలాగే స్పిరిట్ స్టార్ట్ అయ్యేందుకు కూడా కొంచెం సమయం పడుతుంది. సో ఈ గ్యాప్ తర్వాత దీపికా ఏమన్నా అఫీషియల్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.

కాగా ఇంకో పక్క దీపికా నటించిన బాలీవుడ్ సినిమా "సింగం అగైన్" అజయ్ దేవగన్ హీరోగా చేసిన సినిమాలో క్యామియో చేసింది. ఈ సినిమా ఈ దీపావళి కానుకగా బాలీవుడ్ లో ఇపుడు విడుదల అయ్యింది. స్పిరిట్ కూడా ఎలాగో పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమానే కాబట్టి అందులో కూడా అలాంటి పాత్రనే చేస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: prabhas spirt sandeep reddy vanga
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X