50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న టాప్ దర్శకుడు? ఎవరు? ఏ హీరో కోసం అంటే?

ఇప్పుడు ఇండియన్ సినిమా రూపు రేఖలు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. ఆ భాష ఈ భాష అని లేకుండా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో సినిమాలు మంచి ఆదరణ అందుకొని అదరగొడుతున్నాయి. దీనితో పలువురు స్టార్స్ సహా దర్శకులు కూడా ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీకి వెళ్లి మరీ సినిమాలు చేస్తున్నారు. కాగా ఇలా అనేక క్రేజీ కాంబినేషన్ లు ఇండియన్ సినిమా దగ్గర ఇపుడు కనిపిస్తుండగా డిమాండ్ కూడా అంతే రేంజ్ లో ఆయా స్టార్స్ కి పెరిగిపోయింది.

హీరోల సినిమాలు వందల కోట్ల వసూళ్లు అందుకుంటుంటే మన హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ లు భారీ మొత్తంలో పెంచేశారు. కాగా వీరితో పాటుగా దర్శకుల డిమాండ్ కూడా మారింది. దర్శకులు తాము అందిస్తున్న సినిమాలు భారీ వసూళ్లు చేస్తుండడంతో వారు కూడా తమ మార్కెట్ ని పెంచుకున్నారు. ఇలా దర్శకులు కూడా రేట్ పెంచుతూ వస్తున్నారు.

this director got 50 crore as just advance for ntr project

కాగా వీరిలో ఓ దర్శకునికి కేవలం అడ్వాన్స్ గా మాత్రమే 50 కోట్లు అందించినట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ సినిమా కూడా ఎవరితోనో కాదు మన తెలుగు సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా కోసం అన్నట్టు తెలుస్తుంది. అయితే ఇపుడు ఎన్టీఆర్ హిందీలో వార్ 2, తెలుగులో దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలు కాకుండా మరో సినిమా తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఒకరు. తమిళ్ లో తలపతి విజయ్ తో బీస్ట్, యువ హీరో శివ కార్తికేయన్ తో డాక్టర్, అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ లాంటి భారీ హిట్స్ అందించిన తాను తమిళ మార్కెట్ లో సాలిడ్ ముద్ర వేసుకున్నారు. కాగా ఇదే దర్శకుడు తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్టుగా పలు రూమర్స్ ఎప్పుడు నుంచో ఉన్నాయి.

this director got 50 crore as just advance for ntr project

అయితే ఈ సినిమా కోసం ఆల్రెడీ తాను నిర్మాతలు నుంచి కేవలం అడ్వాన్స్ రూపంలో ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టుగా వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే తమిళ నాట కూడా ఈ టాక్ వైరల్ గా మారింది. కాగా ఈ మాస్ కాంబినేషన్ పై భారీ హైప్ మొదటి నుంచి ఉంది.

మరి చూడాలి ఎంతవరకు ఈ సినిమా సాధ్యం అవుతుంది అనేది. ఇక ఈ సినిమా పక్కన పెడితే ఇపుడు నెల్సన్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ కలయికలో సెన్సేషనల్ సీక్వెల్ జైలర్ 2 ని తెరెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న హైప్ అయితే హిట్ టాక్ పడితే ఈజీగా 1000 కోట్లు అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X