టాప్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ? అదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలే..

కొత్త కొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలే కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ థియేటర్స్ లో పట్టం కడతారు. అయితే వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి మూవీ లవర్స్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసిన జానర్ సినిమాలూ చాలా ఉన్నాయి. ఇలా కాలం మారుతున్న కొద్దీ ఎన్నెన్నో సరికొత్త జానర్లు వాటిలో సినిమాటిక్ యూనివర్స్ లు కలపడం వంటివి సినీ ప్రేమికులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది.

కాగా ఈ క్రేజీ సూపర్ హిట్ జానర్స్ లో సూపర్ హీరో జానర్ కూడా ఒకటి. నిజ జీవితంలో సూపర్ హీరోలు అనేవారు ఉండరు కానీ కల్పితంగా క్రియేట్ చేసిన ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ కి వరల్డ్ వైడ్ గా కల్ట్ ఫాలోయింగ్ అండ్ యాక్సెప్టెన్స్ దక్కింది. అయితే ఈ సూపర్ హీరో సినిమాలు చేయడం అనేది మిగతా రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే చాలా కష్టం..

this genre films taking space in tollywood in future with prabhas also

మెయిన్ గా భారీ బడ్జెట్ లు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ హీరో పాత్రని కూడా ఎంతో పర్ఫెక్ట్ గా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఏమాత్రం తేడా జరిగినా కూడా సూపర్ హీరో సినిమా కాస్తా కామెడీ, ట్రోల్స్ పడే సినిమాగా మారిపోతుంది. అందుకే ఎన్నో ఏళ్ళు నుంచి మన ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన ఎన్నెన్నో సినిమాల్లో సూపర్ హీరో జానర్ కాన్సెప్ట్ సినిమాలు చాలా తక్కువే కనిపిస్తాయి.

కాగా మన తెలుగులో అయితే ఈ 2024 లో మొదటి సూపర్ హీరో సినిమా వచ్చింది. అయితే ఇన్నేళ్ల సమయాన్ని మన తెలుగు సినిమా తీసుకున్నప్పటికీ ఇపుడు కనిపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే టాలీవుడ్ లో సూపర్ హీరో జానర్ ఓ రేంజ్ లో ఊపందుకునేలా కనిపిస్తుంది. కాగా ఆల్రెడీ వచ్చిన హను మాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ అండ్ టీం నుంచే ఎన్నో సినిమాలు రాబోతున్నాయి.

ఆల్రెడీ హను మాన్ పార్ట్ 2 జై హనుమాన్, డీవీవీ దానయ్య వారసుడు కళ్యాణ్ తో అధీర, మహాకాళి అనే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా అలాగే నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ కూడా సూపర్ హీరో గానే లాంచ్ కాబోతున్నాడు. అయితే వీటి అన్నిటికి తోడుగా బాలయ్య కూడా సూపర్ హీరో జానర్ లోకి ఎంటర్ కానున్నట్టుగా పలు రూమర్స్ ఇటీవల ఎంతో ఎగ్జైట్ చేసాయి.

this genre films taking space in tollywood in future with prabhas also

ఇక్కడే ఎన్నో సినిమాలు వచ్చేసాయి. కానీ ఇపుడు పాన్ ఇండియా సినిమాని షేక్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్రశాంత్ వర్మ తో సూపర్ హీరోగా మారబోతున్నట్టుగా వార్తలు ఊపందుకున్నాయి. మరి ఇదే గాని జరిగితే తెలుగు సినిమా ఖచ్చితంగా సూపర్ హీరో జానర్ సినిమాల్లో పెద్ద ముద్రే వేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

రీసెంట్ కల్కి 2898 ఎడి సినిమా తోనే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ షేక్ అయ్యింది. అలాంటిది ప్రభాస్ పై ఫుల్ లెంగ్త్ భారీ సినిమా సూపర్ హీరో జానర్ లో పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అని చెప్పాలి. మరి ఈ సెన్సేషనల్ కలయిక జరిగి ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించాలి అని చాలా మంది కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X