గేదెతో అలాంటి సీన్స్.. ఆ తప్పుతో హీరోయిన్ కెరీర్ నాశనం, 220 కోట్లతో సమంత మాస్ హిస్టరీ
సినీరంగంలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటూ చెబుతుంటారు. అయితే అదృష్టం కలిసొచ్చినప్పటికీ మనం చేసే పనుల కారణంగా దురదృష్టం వెంటాడి కోరి కష్టాల్లో పడుతుంటారు నటీనటులు. కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో తొలుత ఆఫర్లు అందుకున్న స్టార్స్.. ఏదో ఒక కారణంతో వాటి నుంచి తప్పుకుంటారు. ఈ అవకాశాన్ని మరో స్టార్ అందుకుని హిట్ కొడుతుంటారు. అది తెలిసి ముందు అవకాశం వచ్చిన నటీనటులు తలబాదుకుంటూ ఉంటారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇలా బంగారం లాంటి అవకాశాలను వదులుకున్న నటీనటులు ఎందరో.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో రంగస్థలం చిత్రం ప్రత్యేకమైనది. అప్పటి వరకు మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తూ వస్తున్న ఆయనలోని పరిపూర్ణమైన నటుడిని ఈ సినిమా బయటకు తీసుకొచ్చింది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం నాన్ బాహుబలి రికార్డుల్లో కొత్త చరిత్ర సృష్టించింది. 1980ల నాటి భారతీయ గ్రామాల్లో పెద్దరికం, కట్టుబాట్లు, ఊరిలో ఆధిపత్యం, కులాలు , పగలు, ప్రతీకారాలు, పరువు ఇలా అన్నింటిని మేళవించి సుకుమార్ ఈ చిత్రాన్ని తీశారు.

టీజర్, ట్రైలర్, రామ్ చరణ్ లుక్‌తోనే రంగస్థలం మంచి మార్కులు వేయించుకుని భారీ హైప్ తెచ్చుకుంది. ఈ ఊపు ఎక్కడా తగ్గకుండా మధ్య మధ్యలో లిరికల్ సాంగ్స్ వదులుతూ సుకుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాను అనుకున్న కథకు ఎలాంటి నటులు కావాలో, ఎవరు కరెక్ట్‌గా సెట్ అవుతారో సుకుమార్ సుదీర్ఘమైన కసరత్తు చేసి ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. రామ్ చరణ్ , సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ, ప్రకాశ్ రాజ్ ఇలా ఎవరికి వారు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
తెరపై వీరిని చూస్తున్నంత సేపు పాత్రలే కనిపిస్తాయి తప్ప నటీనటులు కనిపించరు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన బలం. సుకుమార్ ఆస్ధాన సంగీత దర్శకుడిగా తన మార్క్‌ను కొనసాగించారు డీఎస్పీ, పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరు రంగస్థలాన్ని ఎక్కడో తీసుకెళ్లి పెట్టింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ జిగేల్ రాణి సాంగ్ మాస్‌ను ఊపేసింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి దాదాపు రూ.60 కోట్లతో రంగస్థలం సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
మార్చి 30, 2018న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తన థియేట్రికల్ రన్ ముగించే వరకు రంగస్థలం ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి నాన్ బాహుబలి చిత్రాల కేటగిరీలో కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సెట్ చేసిన రికార్డుల్లో కొన్ని అలాగే ఉన్నాయి. ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీలో ఆఫర్ మిస్ చేసుకున్నారట కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.
తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమనే సంప్రదించారట. కథ విన్న తర్వాత హీరోయిన్ డీ గ్లామర్ రోల్ చేయడానికి ఆమె అంగీకరించినప్పటికీ .. గేదెలు కడగటం, తోమటం వంటి సీన్లు ఉండేసరికి నా వల్ల కాదన్నారట అనుపమ. దీంతో సుకుమార్ ఏకంగా హీరోయిన్‌ని మార్చేసి సమంతకు కబురు పెట్టారట. ఆమె కథ విని వెంటనే ఓకే చేశారట. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రామలక్ష్మీ క్యారెక్టర్‌లో సామ్‌ను తప్పించి వేరొకరిని ఊహించుకోలేనంతగా సమంత ఇరగదీశారు. నిజంగానే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నుంచి తప్పుకున్నారా? లేక ఇది కేవలం పుకారు మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











