ఆశలు గల్లంతు .. హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలాని తీసేసారా?
సౌత్ సినిమా నుంచి వెళ్లి నార్త్ లో సెటిల్ అయిన హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే దాదాపు లేరనే చెప్పుకోవాలి. ఈ లిస్ట్‌లో చాలా మంది హీరోయిన్స్ హిందీలో ఒక రాయి వేశారు కానీ అక్కడ వారికి అదృష్టం వరించలేదు. కానీ నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్స్ మాత్రం చాలా మందే మన తెలుగు సహా దక్షిణాది సినిమా దగ్గర డెఫినెట్ గా మంచి మార్క్ అండ్ మార్కెట్ ని కూడా సెట్ చేసుకున్నవారు చాలా మంది కనిపిస్తారు.
ఈ ఏడాదిలోనే హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ వచ్చి మొదటి సినిమా తోనే హిట్ అందుకొని టాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. ఈమె తర్వాత కూడా చాలా మంది లైన్ లో ఉన్నారు. అయితే వీరికి కొంచెం డిఫరెంట్ గా మరో హాట్ బ్యూటీ టాలీవుడ్‌లో నైస్‌గా సెటిల్ అయ్యిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా.

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ బ్యూటీగా సాలిడ్ బ్రేక్ ని తెలుగులో అందుకొని ఆ వెంటనే ఐటెం సాంగ్స్ లో అది కూడా స్టార్ హీరోస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దీనితో ఊర్వశి రౌటేలా తెలుగులో సెటిల్ అయ్యిపోయింది .. కానీ కేవలం ఐటెం పాటల వరకే అయ్యింది. సరిగ్గా ఈ సమయంలోనే అదే వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్లి ఆమెకి నటిగా అవకాశం ఇచ్చాడు.
బాలకృష్ణతో చేస్తున్న డాకు మహారాజ్‌లో మొదటి నుంచీ ఈమె ఉంది. అంతే కాకుండా ఈమె ఈ సినిమాలో పోలీస్‌గా నటిస్తున్నాను అని ఫొటోస్ కూడా షేర్ చేసుకుంది. కానీ తర్వాత ఏమయ్యిందో కానీ ఆమె గురించి ఎలాంటి ఊసు లేదు. దీనితో ఈమె సీన్స్ ని సినిమాలో తీసేసినట్టే అని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాగా ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మేకర్స్ ఆమె సంతృప్తి కోసం ఊర్వశి రోల్ తీసేసినా హాట్ ఐటెం సాంగ్ ని అయితే ప్లాన్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో ఊర్వశితో ఐటెం సాంగ్ ఉందని లేటెస్ట్ గా నిర్మాత నాగవంశీ కూడా రివీల్ చేశారు. అంటే ఈమెని సినిమాలో మొదట తీసుకొని తర్వాత తీసేసినప్పటికీ ఈ రకంగా ఛాన్స్ ఇచ్చి సంతృప్తి పరిచినట్లుగా చెప్పాలి . అయితే అప్పట్లో ఊర్వశి మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యిపోయింది.
కానీ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు మూలాన ఆమె రోల్ ని పక్కన పెట్టి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. సో మొత్తానికి ఈ హాట్ బ్యూటీ నటిగా కాకపోయినా మళ్ళీ ఐటెం భామ గానే కనిపించనుంది అని చెప్పాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఊర్వశి కాకుండా ఈ సినిమాలో హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అఖండ నటి ప్రగ్యా జైస్వాల్, లేటెస్ట్ మెకానిక్ రాకీ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్, అలాగే కలర్ ఫోటో ఫేమ్ నటి చాందిని చౌదరిలు ఈ సినిమాలో నటిస్తున్నారు. జనవరి 12న సినిమా సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











