Balakrishna Chiranjeevi: బాలయ్యకు బాగా నచ్చిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి,-నందమూరి బాలకృష్ణ మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహ బంధం ఉందన్న సంగతి తెలిసిందే. సినిమాల పరంగా ఎంతటి పోటీ ఉన్నా కూడా.. వీరిద్దరు ఆ పోటీని ఎప్పుడూ పెద్దగా పర్సనల్ గా తీసుకోని ఉండరు. సినిమా వేరు, స్నేహం వేరు అని నమ్ముతారట. చాలా సందర్భాల్లో ఒకరిపై ఇంకొకరికి ఉన్న తమ అభిమానాన్ని కూడా చాటుకున్నారు. అలా ఓ సందర్భంలో బాలయ్య.. చిరు గురించి మాట్లాడుతూ తనకు నచ్చిన మెగాస్టార్ సినిమా ఏంటో తెలిపారు. దాని గురించే ఈ కథనం.

ఇద్దరికి భారీ స్థాయిలో.. :మెగాస్టార్ చిరంజీవి,-నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ లో వీరిద్దరికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. బాక్సాఫీస్ బరిలో దిగారంటే బాక్సులు బద్దలవ్వాల్సిందే. వీరి సినిమాలకున్న క్రేజ్, పోటీ మరే ఇతర హీరోకు ఉండదు. వీరిద్దరి సినిమా ఒకే సీజన్‌లో రిలీజ్ అవ్వుతుందంటే.. ఫ్యాన్స్ ఆనందానికి, హడావిడికి హద్దు ఉండదు. అయితే ఈ అగ్రహీరోలిద్దరూ దాదాపుగా ఒకేసారి సినీ కెరీర్ ప్రారంభించారు. త‌మ‌దైన స్టైల్ అండ్ టాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎద‌గుతూ స్టార్ స్టేటస్ ను అందుకోవడంతో పాటు భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ అభిమానులు మాత్రం ఎప్పుడు మెగా వ‌ర్సెస్ నంద‌మూరి అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వార్స్‌ చేస్తూనే ఉంటారు. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప, మా మెగాస్టార్ సినిమా బాగుందంటే.. కాదు మా బాలయ్య చిత్రమే బాగుంది.. అంటూ మెగా, నందమూరి అభిమానలు పోటీ పడుతూనే ఉంటారు.

This is Balakrishnas favorite movie among Chiranjeevi movies

ఎంతో అన్యోన్యంగా... :అయితే చిరంజీవి బాలయ్య మాత్రం ఎప్పుడూ కలిసిన ఎంతో అన్యోన్యంగా పలకరించుకుంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో బీజీ ఎక్కువ అయిపోవడం వల్ల ఒకే వేదికపై ఇద్దరూ కనపడి చాలా రోజులు అయింది గానీ.. వాస్తవానికి ఇద్దరు మంచి మిత్రులే. గతంలో చాలు సార్లు ఒకే వేదికను పంచుకున్నారు. పలు ఇంటర్వ్యూలో, బహిరంగ సభల్లో ఒకరిపై ఇంకొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. తమ మధ్య జరిగిన సంఘటనలను పంచుకున్నారు. అయితే అలా ఓ సారి బాలయ్య.. గతంలో ఓ సందర్భంలో తనకు ఇష్టమైన చిరంజీవి సినిమా గురించి చెప్పుకొచ్చారు. అవును మీరు చదివింది నిజం.

This is Balakrishnas favorite movie among Chiranjeevi movies

ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే.. :చిరంజీవి తన కెరీర్ మొత్తంలో 150కి పైగా చిత్రాల్లో న‌టించారు. అందులో ఎన్నో హిట్స్‌, సూప‌ర్ హిట్స్‌, ఇండ‌స్ట్రీ హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే బాల‌య్య‌ బాబుకు మాత్రం.. చిరంజీవి న‌టించిన అన్ని సినిమాల్లో ఒకే ఒక్క చిత్రం ఎక్కువ ఇష్ట‌మ‌ట‌. అదేంటంటే.. 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. చిరంజీవి నటించిన చిత్రాల్లో బాల‌య్యకు అదే ఫేవ‌రెట్ మూవీ అటు. గ‌తంలో బాల‌కృష్ణ స్వ‌యంగా ఈ విష‌యాన్ని చెప్పినట్లు కథనాలు ఉన్నాయి.

This is Balakrishnas favorite movie among Chiranjeevi movies

బాక్సీఫీస్ వద్ద రికార్డులు.. :ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తెరకెక్కించారు. చిరంజీవి, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి జంట‌గా న‌టించి ఆకట్టుకున్నారు.. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వనీదత్ నిర్మించారు. అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి త‌దిత‌రులు ఇతర పాత్రలో నటించారు. 1990లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. కాసుల వ‌ర్షం కురిపించడంతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను.. అలానే బాల‌య్య‌ను కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X