తన పెళ్ళి వార్తలో ఏ మాత్రం నిజం లేదంటున్న హీరోయిన్...
పెళ్ళయిన హీరోలను హీరోయిన్లు పెళ్ళి చేసుకోవడమనేది ఇప్పటిది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ అయినప్పటి నుంచీ వున్నదే. ఈ మధ్య ప్రభుదేవా, నయనతార పెళ్ళి విషయం కోర్టు వరకూ వెళ్ళడం మనం చూశాం. అదే కోవలో హీరోయిన్ నిఖిత కన్నడ హీరో దర్శన్ ను పెళ్లి చేసుకుందన్న వార్త గుప్పుమంది. దర్శన్ కి పది సంవత్సరాల క్రితమే పెళ్ళయింది. ఒక బాబు కూడా ఉన్నాడు.
దర్శన్, నిఖిత సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్నారన్న రూమర్ వినిపిస్తోంది. కన్నడలో చాలా బిజీగా వున్న నిఖితకు దర్శన్ ముంబైలో ఒక ప్లాట్ కూడా కొన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే వాళ్లిద్దరు తాము పెళ్లిచేసుకున్నామన్న వార్తలో ఎంత మాత్రం నిజంలేదని చెప్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న 'ప్రిన్స్" అనే సినిమాలో ఓ పెళ్ళి సీన్ లో నటించామని, ఆ కాస్ట్యూమ్స్ లో వున్న ఫోటోలతో ఈ ప్రచారం చేస్తున్నారని, ఈ రూమర్స్ ను తాము పట్టించుకోవడం లేదని ఇద్దరూ ముక్తకంఠం తో జవాబిస్తున్నారు.


Click it and Unblock the Notifications











