Balakrishna: నందమూరి ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్... సినిమాలకు నటసింహం బాలకృష్ణ బ్రేక్!
నందమూరి నటసింహం బాలయ్య స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కు ఊపే. జై బాలయ్య అంటూ ఊగిపోతారు. అంతలా బాలయ్యకు క్రేజ్. అయితే నందమూరి అభిమానులకు ఓ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నందమూరి నటసింహం బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు అనే వార్త వినిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందినా.. మరో విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు నందమూరి బాలయ్య ఎందుకు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు... ఏంటి అనేది ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
నటసింహ బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే ఫ్యాన్స్ ఊగిపోతారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తారు. అయితే ఆయన ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటునే.. మరో పక్క ప్రజాపాన నిర్వహిస్తున్నారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య ఎన్బీకే 108 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా.. బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం ఏపీ రాజకీయాలు అని తెలుస్తోంది. ఇన్నాళ్లు రెండు పడవలు మీద ప్రయాణించిన బాలకృష్ణ.. ఇప్పుడు సినిమా అనే పడవని పక్కన పెట్టనున్నారని సమాచారం. మరో 2 నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్టీ వారు ఈ ఎన్నికల్లో గెలుపుని సొంతం చేసుకోవడం కోసం పని చేస్తున్నారు. . దీంతో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఇక ఈ పోటీని ఎదుర్కొనేందుకు బాలకృష్ణ కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎన్నికలపై దృష్టి పెట్టనున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నిర్ణయంతో NBK109 షూటింగ్ కి బ్రేక్ లు పడబోతున్నట్లు అర్థం అవుతుంది.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. 1980's బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య నుంచి ఇప్పటివరకు చూడాలని వయోలెన్స్ ఆడియన్స్ చూడబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ చెప్పుకువచ్చారు. బాలయ్య అభిమానులలో ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. గత ఏడాదే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. దాదాపు 20 రోజులు పాటు ఊటీలో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.
ఆ తరువాత షెడ్యూల్ ని రాజస్థాన్ లో ప్లాన్ చేయగా.... అక్కడ కూడా ఒక అదిరిపోయే యాక్షన్ షెడ్యూల్ ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. సినిమాలో అయితే వేరే లెవెల్ లో ఉంటుందని బాబీ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాకు బ్రేక్ పడుతుందో లేదో.


Click it and Unblock the Notifications











