Fact Check: రకుల్ పెళ్లి కోసం 10 కోట్లు పంపిన బడా నేత ?.. అసలు నిజం ఏంటంటే?

హిందీ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చి జెండా పాతిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారని తెలిసిందే. అలాంటి వారిలో కొందరు వచ్చిన కొద్దికాలంలోనే మంచి ఫేమ్ అండ్ మార్కెట్ ని అందుకొని అంతే వేగంగా ఫేడ్ అవుట్ అయ్యిపోతారు. కాగా అలాంటి స్టార్ హీరోయిన్ హాట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరని చెప్పాలి.

రకుల్ హిందీ ఇండస్ట్రీ నుంచి తెలుగులో యంగ్ హీరో సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో డెబ్యూ ఇచ్చింది. కానీ దానికి ముందే మరో యంగ్ హీరో డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ తో "రఫ్" అనే సినిమా చేసింది. తెలుగులో చిన్న హీరోస్ తోనే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత మాత్రం స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ , చిరంజీవి, నాగార్జున, రవితేజ, అల్లు అర్జున్‌ల పక్కన కూడా స్క్రీన్ షేర్ చేసుకునే రేంజ్ కి వెళ్ళిపోయింది.

this political leader arranged 10 crore for rakul preet here is the truth

కానీ ఆమె డౌన్ ఫాల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టలేదు. ఇవి పక్కన పెడితే ఈమె విషయంలో చాలా మంది హీరోయిన్స్‌కి ఉన్నట్టే పలు గాసిప్స్ కూడా లేకపోలేవు. ఓ ప్రముఖ పొలిటీషియన్ కి లింక్ చేస్తూ ఆమెపై పలు షాకింగ్ రూమర్స్ వైరల్ అవుతూనే వస్తున్నాయి. తాజాగా ఇపుడు కూడా ఓ షాకింగ్ న్యూస్ ఇపుడు వైరల్ గా మారింది.

రకుల్ ఎప్పుడైతే తన సినిమాలు సౌత్ లో అంతగా రాణించడం లేదు అని తెలుసుకుందో ఇక పర్శనల్ లైఫ్ లో కీలక డెసిషన్ తీసుకుంది. నార్త్ కే చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ విక్కీ భగ్నానీని పెళ్ళాడి ఇపుడు పర్శనల్ లైఫ్ లో అలాగే బాలీవుడ్ లో బిజీగా ఉంది. కాగా యిపుడు తన పెళ్ళికి సంబంధించే పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి.

వీటి ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , అప్పటి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు సంస్థల ద్వారా ఆమె కోసం రూ.10 కోట్ల రూపాయలు పంపించారు అంటూ సోషల్ మీడియాలో షాకింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఇపుడు మరోసారి రకుల్ అలాగే ఆ సదరు రాజకీయనేత వ్యవహారంపై మళ్ళీ చర్చ మొదలైంది.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేస్ సమయంలో కొన్ని అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయ్యింది. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాలతోనే గ్రీన్ కో సంస్థ ఆ నగదును మళ్లించిందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ వార్తా కథనం ఫేక్ అని సజాగ్ టీం ఫాక్ట్ చెక్ లో తేల్చింది. అలాగే తమ వెబ్‌సైట్, యాప్ నుంచి ఇది పబ్లీష్ కాలేదని సదరు సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. దీనితో రకుల్ విషయంలో వచ్చిన ఆ పుకార్లలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

కాగా రకుల్ ప్రీత్ మాత్రం ఆ మధ్య ఇలాంటి వార్తలు వస్తే వెంటనే ఖండించింది. తాజాగా తనపై మళ్ళీ ఇదే తరహాలో వార్తలు రావడం ఆమెకు షాక్ అని చెప్పాలి. మరి ఈసారి తన నుంచి సీరియస్ యాక్షన్ ఏమన్నా ఉంటుందా లేదా అనేది. ఇక రకుల్ లేటెస్ట్ గా అయితే ఈ ఏడాదిలో దర్శకుడు శంకర్, కమల్ హాసన్ భారీ సినిమా ఇండియన్ 2 లో సిద్ధార్థ్ సరసన నటించింది. అలాగే వచ్చే ఏడాది దీనికి కొనసాగింపు సినిమా ఇండియన్ 3 లో కనిపించనుంది.

More from Filmibeat

Read more about: rakul preet singh ktr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X