»   »  ఆ 'స్టార్స్' హోటల్ భాగోతం...

ఆ 'స్టార్స్' హోటల్ భాగోతం...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nikitha
చెన్నై లో ఒక వెలుగు వెలుగిన స్టార్ హోటల్ (పేరు వద్దు లెండి) ఒకటి ఉంది. అయితే ఆ హోటల్ కాలంతో సమానంగా పరుగెత్తలేక వసతులు విషయంలో అప్ డేట్ కాలేక మిగిలిపోయింది. దాంతో సాధారంణంగానే కష్టమర్స్ లేక భోరుమనేది. అయితే హఠాత్తుగా అక్కడ బిజీ పెర్గిపోయింది. అందులోనూ అక్కడికి అంతా సినిమా వాళ్ళే రావటంతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. దాంతో అసలు ఏం జరిగింది అని ఎంక్వైరీ చేసిన వాళ్ళు నోరు వెళ్ళబెట్టే నిజాలు బయిట పడ్డాయి.

అక్కడ ఎవరికీ ఐడియా వచ్చిందో గానీ సినీ తారలతో ఆ స్టార్ హోటల్ బిజీ చేయటానికి లాడ్జి గా మార్చేసారు. గంట ,రెండు గంటలకు కూడా అద్దెకివ్వటం ప్రారంభించారుట. ఎక్కడెక్కడి పెయిర్స్ కామ్ గా అక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నారుట. దాంతో ఆ స్టార్ హోటల్ కాస్తా స్టార్స్ హోటల్ గా మారిపోయింది. అయితే రెగ్యులర్ గా చెన్నై వెళ్ళే సీనియర్ నిర్మాతలకు,దర్శకులకు,హీరోలకు అది సుపరిచితమే. అయితే అక్కడికి వెళ్ళామని ఎవరూ చెప్పుకోరు. షాపింగ్ కి వెళ్ళినట్లుగా వెళ్ళి ఓ గంటో రెండు గంటలో అక్కడ గడిపేసి వస్తారట.

అలాగే దానికి తగ్గట్లే ఫీజు కూడా ఉంటుందిట. గుట్టు చప్పుడు కాకుండా అందరి పనులు జరుగుతూండటంతో పూర్తి స్ధాయి బిజీ అయిపోయింది. అక్కడ స్పెషాలిటీ ఈ మధ్య బయిటకు పొక్కటంతో రైడ్స్ జరుగుతాయని పై స్ధాయి వారితో టై అప్ అయి కష్టమర్స్ కి రేట్స్ పెంచారుట. అయితే అక్కడికి వెళ్ళే వారిలో పాపులర్ తెలుగు,తమిళ పరిశ్రమల వారు ఉండటంతో...సినిమా వాళ్ళు ఏదైనా చెయ్యగలరు..అని చుట్టుప్రక్కల వాళ్ళు నోళ్ళు నొక్కుకుంటున్నారుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X