కొడుకుని స్టార్‌గా చూడాలని.. మెట్టు దిగొచ్చిన సీనియర్ హీరో, తగ్గని రాజమౌళి
ఎస్ఎస్ రాజమౌళి. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెంచడంతో పాటు టాలీవుడ్ రేంజ్‌ని ఆస్కార్‌కి తీసుకెళ్లిన దర్శకధీరుడు. ప్రతి సినిమాకి తన రికార్డులన్ని తానే బద్ధలు కొడుతూ ఎవరెస్ట్ అంతటి ఇమేజ్ అందుకున్నారు జక్కన్న. హీరోల రాజ్యం నడిచే ఇండస్ట్రీలో వారిని మించిన క్రేజ్‌తో దూసుకెళ్తున్నారు రాజమౌళి. భారతదేశంలోని ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తమ జీవితంలో ఒక్కసారైనా రాజమౌళితో సినిమా చేయాలని అనుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు శిష్యుడిగా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినిమా మేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలను రాజమౌళీ సమూలంగా మార్చివేశారు. బాహుబలితో పాన్ ఇండియా కల్చర్‌ను భారతదేశానికి పరిచయం చేసిన జక్కన్న బాలీవుడ్ పునాదులను కదలించారు. ఇప్పుడు ఆయన వేసిన బాటలో దక్షిణాది నుంచి ఎన్నో పాన్ ఇండియా సినిమాలు హిందీ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్నాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో SSMB 29 పేరుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.

తన పని తాను చేసుకోవడం, మీడియాకు దూరంగా ఉండటం రాజమౌళి తత్వం . మంచి సినిమా వచ్చినప్పుడు దానిని ప్రమోట్ చేస్తూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో రాజమౌళి ఎప్పుడూ ముందే ఉంటారు. వృత్తి పట్ల అంకిత భావం, పని రాక్షసుడిలా ఎప్పుడూ కష్టపడే రాజమౌళిని జూనియర్ ఎన్టీఆర్ సరదాగా జక్కన్న అని పిలుస్తుంటారు. భారతీయ సినీ రంగానికి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
రాజమౌళి ఊ అనాలే కానీ వందల కోట్లు రెడీగా పెట్టుకుని ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టూ బాలీవుడ్ బడా నిర్మాతలు క్యూకడుతుంటారు. తన సినిమాలకు కుటుంబమే బలమని గట్టిగా నమ్మే రాజమౌళి.. తన ఫ్యామిలీని తన సినిమాలో ఇన్వాల్వ్ చేస్తూ బెస్ట్ ఔట్ పుట్ రాబడుతుంటారు. తనకేం కావాలో రాబట్టుకుని , అలా వచ్చే వరకు సినిమాను చెక్కుతూనే ఉంటారు. రాజమౌళి సక్సెస్ వెనుక మార్కెటింగ్ స్ట్రాటజీది కూడా కీలకపాత్ర. సినిమాను ఎలా పబ్లిసిటీ చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు హైప్ పెంచుకుంటూ పోవడం రాజమౌళికే చెల్లింది.
టాలీవుడ్‌లో రాజమౌళితో సినిమాలు చేయాలని అందరు హీరోలకు ఉంది. అలాగే కొందరు సీనియర్ హీరోలు తమ వారసులను జక్కన్న చేతిలో పెట్టాలని చూస్తుంటారు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా తన బిడ్డ మంచు విష్ణుతో ఓ సినిమా తీయమని రాజమౌళిని తెగ బతిమలాడినట్లు ఫిలింనగర్‌లో చర్చించుకుంటూ ఉంటారు. రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యమదొంగలో యముడిగా మోహన్ బాబు నటించి ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు. యమదొంగ షూటింగ్ సమయంలో రాజమౌళితో ఎప్పుడూ విష్ణు సినిమా గురించే మాట్లాడేవారట మోహన్ బాబు. అయితే జక్కన్న మాత్రం తర్వాత చూద్దాంలే అని తప్పించుకునేవారట. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్‌తో కన్నప్ప నిర్మిస్తున్నారు మోహన్ బాబు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











