RRRను మించిన కాంబో సెట్ చేసిన రాజమౌళి? .. మహేష్‌కి అన్నగా సూపర్‌స్టార్?
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్ రేంజ్‌ను పెంచుతూ ఇప్పుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు టార్చ్ బేరర్‌గా మారారు రాజమౌళి. కమర్షియల్ సినిమానే కొత్తగా ప్రజెంట్ చేయడంలో ఆయన మాస్టర్. ఆయన సినిమాల్లోని ప్రతి సీన్ ఓ క్లైమాక్స్‌లా ప్రేక్షకుడిని కుర్చీలో కుదురుగా కూర్చోనివ్వదు.
స్టూడెంట్ నెం 1, సింహాద్రి, ఛత్రపతి, సై, విక్రమార్కుడు , మగధీర, ఈగ సినిమాలతో భారతదేశం మొత్తం రాజమౌళి పేరు మారుమోగిపోయింది. తర్వాత బాహుబలిని రెండు భాగాలుగా, పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా మలచి అందరికీ షాకిచ్చారు. ఓ ప్రాంతీయ సినిమాపై రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టి రెండు భాగాలుగా తీసి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా బాహుబలిని నిలబెట్టారు రాజమౌళి.

సినిమా మేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలను రాజమౌళీ సమూలంగా మార్చేశారు. పాన్ ఇండియా కల్చర్‌ను భారతదేశానికి పరిచయం చేయగా.. ఇప్పుడు ఆయన వేసిన బాటలో ఎన్నో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కి బాలీవుడ్‌పై దండెత్తుతున్నాయి. బాహుబలి తర్వాత జక్కన్న ఏం చేస్తాడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. మరో సంచలన ప్రకటన చేశారాయన.
దశాబ్ధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండే రెండు కుటుంబాల వారసులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అదే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను అందుకుని భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేశ్ గతంలో ఎన్నడూ చూడని న్యూ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకోక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. ఎస్ఎస్ఎంబీ 29లో మహేశ్ బాబుకి అన్నగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు , విక్టరీ వెంకటేష్ నటించనున్నారట. గతంలో వీరిద్దరూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించగా ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం బొమ్మ బ్లాక్‌బస్టరే అంటున్నారు ఘట్టమనేని అభిమానులు.


Click it and Unblock the Notifications











