Pooja Hegde: వామ్మో పూజా హెగ్డే! అందుకే ముఖం చాటేస్తున్న టాలీవుడ్ నిర్మాతలు

గడిచిన కొన్నేళ్లలో తెలుగు సినిమా దగ్గర తక్కువ కాలం లోనే మంచి ఫేమ్ ని అందుకున్న హీరోయిన్స్ లో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఒకామె అని అందరికీ తెలిసిందే. కాగా పూజా హెగ్డే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నాళ్లకే తెలుగులో బిగ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అలా అక్కడ నుంచి గోల్డెన్ లెగ్ గా మారిపోయిన పూజా ఏ ప్లాప్ హీరోకి అయినా ఆమె సైన్ చేస్తే ఆ సినిమా హిట్ అనే రేంజ్ లో తన ఫేమ్ మారింది.

కానీ తనకి ఎంత త్వరగా తెలుగులో మార్కెట్ వచ్చిందో అంతే త్వరగా తన ఫేమ్ కూడా పోగొట్టుకుంది అని చెప్పాలి. కాగా పూజా హెగ్డే దాదాపు రెండున్నరేళ్ల నుంచి తెలుగు సినిమాలో కనిపించలేదు. ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలు నుంచి కూడా ఆమె బయటకి వెళ్లిపోవడం జరిగింది. ఇక ఇలా తెలుగు సహా సౌత్ సినిమాల్లో కనుమరుగు అయ్యిపోయింది అనుకున్న పూజా హెగ్డే మళ్ళీ సౌత్ లో బిజీగా మారింది.

Pooja Hegde

కాగా ఇపుడు ఆమె చేస్తున్న అన్ని సినిమాలు కూడా కేవలం తమిళ్ లోనే కనిపిస్తుండడం గమనార్హం. ఇక్కడే చాలా మందికి కొన్ని డౌట్స్ కూడా రావచ్చు. తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ కదా మరి తెలుగు సినిమాలు ఎందుకు ఓకే చేయడం లేదు అని? కాగా దీనికి షాకింగ్ రీజన్ ఇపుడు సినీ వర్గాల నుంచి లీక్ అయ్యింది. మేడం పూజా హెగ్డే సెకలు ఆన్ లొకేషన్ లో మామూలుగా ఉండవట.

ఆమె షూటింగ్ చాలా ఆలస్యంగా రావడం మొదలు క్యారీ వ్యాన్ నుంచి కూడా సరైన సమయానికి బయటకి రాదట. అంతే కాకుండా తనతో పాటుగా ఒక పది పదకొండు మంది ఫ్రెండ్స్ బ్యాచ్ ని షూటింగ్ స్పాట్ కి ఆమె తెచ్చుకొని వారి ఖర్చులు కూడా నిర్మాతల మీదే భారం వేసేదని తెలుస్తుంది. ఇలా పూజా హెగ్డే తన నిర్మాతలకి టార్చర్ చూపించేది అని టాక్.

ఇంతే కాకుండా తనతో వర్క్ చేసిన పలువురు హీరోలు కూడా పూజా హెగ్డే ప్రవర్తనతో చాలా విసుగెత్తిపోయేవారట. ఇలా మేడం మాత్రం ఫామ్ లో ఉన్నన్నినాళ్ళు గట్టిగానే విసుగు తెప్పించేదట. ఇక ఎప్పుడైతే తన ఫామ్ కోల్పోయిందో మళ్ళీ అక్కడ నుంచి ఆమెని ఏ సినిమాలో తీసుకోవడం మానేసారని తెలుస్తుంది.

ఇలా తెలుగు సినిమాలో పూజా హెగ్డే తన చేష్టలతో దూరం పెంచుకుంది అని సినీ వర్గాల్లో సహా సోషల్ మీడియాలో కూడా ఒక టాక్ ఇపుడు నడుస్తుంది. అందుకే ఇపుడు ఆమె తమిళ్ బిజీ అయినప్పటికీ తెలుగులో మాత్రం అవకాశాలు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని వినికిడి. ఇక ప్రస్తుతం తమిళ్ లోనే పూజా హెగ్డే స్టార్ హీరోస్ సూర్య, విజయ్ దళపతి లతో రెట్రో, జన నాయగన్ అనే భారీ సినిమాలు చేస్తుండగా వీటితో పాటుగా లారెన్స్ తో కూడా ఓ సినిమా చేస్తుంది.

Take a Poll

More from Filmibeat

Read more about: pooja hegde coolie jana nayagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X