'తొలి ప్రేమ' కాంబినేషన్ రిపీట్ కై సన్నాహాలు !?
పవన్ కళ్యాణ్, కరుణాకరన్ కాంబినేషన్లో 'తొలి ప్రేమ' చిత్రం వచ్చి సూపర్ హిట్టయింది. అలాగే ఆ చిత్రంతోనే కరుణాకన్ ని పవన్ పరిచయం చేసారు. అయితే ఆ తర్వాత వీరి కాంబినేషన్లో బాలు..ఎబిసిడిఎఫ్ చిత్రం వచ్చి నిరాశపరిచపరిచింది. దాంతో వీరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాలేదు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి కరుణాకరన్ కథ చెప్పారని సమాచారం. అలాగే కరణాకరన్ చెప్పిన లైన్ నచ్చి...స్క్రిప్టులో కొన్ని మార్పులు పవన్ చెపితే అవి చేసే పనిలో దర్శకుడు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కూడా ఓ లవ్ స్టోరీ అనీ, మారిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సీన్స్ మార్చమన్నట్లు చెప్తున్నారు. అలాగే కరుణాకరన్..రూపొందించిన డార్లింగ్ చిత్రం రెండు వారాల క్రితం రిలీజైంది. కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం యావరేజ్ టాక్ మాత్రం తెచ్చుకోగల్గింది. ప్రభాస్ దుస్తులు, స్టైల్స్ మీద పెట్టిన శ్రధ్ద..కథ, కథనాల మీద పెట్టలేదని అందుకే ఊహించినంతగా సినిమా వర్కవుట్ కాలేదని అంతటా వినిపించింది.


Click it and Unblock the Notifications











