మహేష్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ని తప్పించటానికి కారణం?
కంటిన్యూగా శ్రీను వైట్ల చిత్రాలన్నిటికీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మహేష్ బాబుతో శ్రీను వైట్ల చేయబోయే చిత్రానికి తమన్ ని మ్యూజిక్ డైరక్టర్ గా ఎన్నుకున్నారు. అలాగే ఎన్టీఆర్ సైతం తన తాజా చిత్రం బృందావనంకు సైతం తమన్ నే ఎన్నుకున్నారు. అలాగే మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు సైతం దేవిశ్రీ ప్రసాద్ ప్లేస్ లో తమన్ వచ్చి చేరారు.దానికి కారణం కేవలం తమన్ స్పీడు కంపోజింగ్ అని తెలుస్తోంది. దేవి ఒకటికి పది ప్రాజెక్టులు ఒప్పుకుని అనుకున్న టైమ్ కి ఇవ్వలేకపోవటం జరుగుతోందని, అలాగే ఈ మధ్య అతనిలో హీరో అవ్వాలనే కోరకి పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడని అందుకే దేవిని తప్పిస్తున్నారని తెలిసింది. అయితే దేవి మాత్రం తనకు దశావతారం హిట్టయిన దగ్గరనుంచీ తమిళంలో, హిందీలో ఆఫర్స్ పెరిగాయని అక్కడ డిమాండ్ కు అణుగుణంగా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నానని చెప్తున్నాడని వినికిడి. ఇక కిక్ మ్యూజిక్ హిట్టవటంతో తెలుగులో తమన్ కి మంచి డిమాండ్ పెరిగింది. తమన్..శంకర్ బాయ్స్ చిత్రంలో నటించిన హీరోల్లో ఒకరు. ఇక మహేష్, శ్రీను వైట్ల చిత్రానికి దూకుడు అనే టైటిల్ ఫైనలైజ్ చేసారు. సమంత హీరోయిన్ గా చేసే చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











