"సలార్ 1" పై ఆ రూమర్స్ నిజమేనా?... ప్రశాంత్ నీల్ కోరుకున్నది జరగలేదా?
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాకు ఫేస్ ఎవరు అంటే అందులో మొట్టమొదటిగా నిలిచే హీరో రెబల్ స్టార్ ప్రభాస్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తనని పాన్ ఇండియా స్టార్ ని చేస్తే తాను మాత్రం తనతో వర్క్ చేస్తున్న చిన్న దర్శకులని సైతం పాన్ ఇండియా దర్శకులుగా ప్రభాస్ మారుస్తున్నాడు.
అలా తాను బాహుబలి 2 తర్వాత దాదాపు ఒక్క సినిమా రెండు సినిమాలు లేదా అంతకు ముందు పాన్ ఇండియా సినిమాలే చెయ్యని దర్శకులతో వర్క్ చేసాడు. అయితే ఈ అన్ని చిత్రాల్లో మాత్రం పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో అనౌన్స్ చేసిన సలార్‌పై అప్పట్లో నెలకొన్న హైప్ అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పాలి.

ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడే ఈజీగా రూ.1000 కోట్లు కొట్టేస్తుంది అని అంతా భావించారు. కానీ ఈ సినిమా ఆ ఫీట్ ని అందుకోలేకపోయింది. నిజానికి ఈ సినిమా చాలా వరకు కేజీయఫ్ ఫ్లేవర్ లోనే ఉందనే కామెంట్స్ కూడా విమర్శకుల నుంచి వినిపించాయి. దీనితో అప్పట్లో సలార్ 1ని చాలా మంది అంతలా ఎంజాయ్ చేయలేకపోయారు. ఈ కారణం చేత సలార్‌కి పలు చోట్ల నష్టాలు కూడా వచ్చాయి అని టాక్ ఉంది.
ఇక సలార్ స్క్రిప్ట్ విషయంలో కొన్ని ఆసక్తికర అంశాలు దాగి ఉన్నాయి. నిజానికి ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కి సలార్ స్క్రిప్ట్ పర్శనల్‌గా ఎంతో ఇష్టమైంది అని చాలా మందికి తెలియకపోవచ్చు. తాను అనుకున్న ఈ సినిమా కథ వరల్డ్ వైడ్ ఆడియెన్స్ కి రీచ్ అవ్వాలి అన్నదే తన కోరిక. ఈ సినిమా ఒరిజినల్‌గా ముందు కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళితో "ఉగ్రం" పేరిట తెరకెక్కించాడు ప్రశాంత్.

అక్కడ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ ప్రశాంత్ నీల్‌లో ఏదో వెలితి కనిపించింది. అందుకే వెంటనే యష్‌తో కేజీయఫ్ సిరీస్ చేసి పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అలా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి ఉగ్రంని ప్రభాస్‌తో సలార్‌గా రీమేక్ చేసి గ్రాండ్ రిలీజ్ చేసాడు. కానీ ఇది అనుకున్న రేంజ్ లో రీచ్ కాలేదు అంటూ స్వయంగా ప్రశాంత్ నీల్ చెబుతున్నాడు. పార్ట్ 1 రీచ్ తను అనుకున్న దానికి ఏమాత్రం సరిపోలేదు అంటున్నాడు.
ఈ డిసెంబర్ 22తో సలార్ వచ్చి ఏడాది పూర్తయ్యింది కానీ పార్ట్ 1 విషయంలో తాను ఇంకా డిజప్పాయింట్‌గానే ఉన్నాడట. ఇది ఫ్యాన్స్‌ని సైతం ఆశ్చర్యానికి లోను చేసింది. దీనితో సలార్ 1 విషయంలో వచ్చిన అప్పటి రూమర్స్ నిజమే అని అనుకోవచ్చు. థియేటర్స్‌లో అంతగా ఆదరించలేదు కానీ ఓటిటిలో మాత్రం సలార్‌కు రిపీట్స్ పడ్డాయి. మరి నీల్ ఇంకా ఎలాంటి రీచ్ ని కోరుకున్నాడో కానీ ఈ స్క్రిప్ట్ పరంగా మాత్రం ఇంకా తనను ఏదో వెలితి మాత్రం వెంటాడుతుంది అని అనిపిస్తుంది. మరి చూడాలి.. సలార్ పార్ట్ 2తో అయినా తాను కోరుకున్న రీచ్, ప్రశాంత్ నీల్ డ్రీం ప్రాజెక్ట్‌కి వస్తుందో లేదో అనేది.


Click it and Unblock the Notifications











