మహేష్ సినిమాలో వీరిద్దరూ కీ రోల్స్
హైదరాబాద్ : మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషనల్‌లో వచ్చిన ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘‘ బ్రహ్మోత్సవం '' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ లుకీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తొలినుంచీ శ్రీకాంత్ అడ్డాల చిత్రాల్లో వీరికి కీ రోల్స్ ఉంటూ వస్తున్నాయి. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా చిత్రాల్లో ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు గుర్తుండి పోయే పాత్రలు చేసారు. అలాగే ఈ బ్రహ్మోత్సవం చిత్రంలోనూ వీరికి ప్రత్యేకమైన పాత్రలు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్... పివిపి బ్యానర్ పై నిర్మించనున్నాడు. ఈ సినిమాకి ‘బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలో తెలుస్తాయి.
మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవలే మహేష్ బాబు - పూర్ణలపై వచ్చే ఓ సాంగ్ ని షూట్ చేసారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు తన సినిమా శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











