twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రోబో’ కనక వర్షంతో ఊపిరి పీల్చుకొన్న టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్...!?

    By Sindhu
    |

    శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా, ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా రూపొందిన 'రోబో" చిత్రం తెలుగు హక్కులను 27కోట్లు ఇచ్చి కైవసం చేసుకున్నాడు తోట కన్నారావు. ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమా హక్కులను కైవసం చేసుకున్నందకు తోట కన్నారావు తప్పుచేసాడని, ఇంత మొత్తం తిరిగి రాబట్టకోవడం చాలా కష్టమని చిత్ర పరిశ్రమలోని చాలా మంది ఊహించారట. ఈ నేపధ్యంలో కన్నారావు కూడా చాలా టెన్షన్ పడ్డాడు.

    విడుదలకుముందే కన్నారావు బిపి పెరిగి ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నాడని సమాచారం. కానీ ప్రస్తుతం 'రోబో" కురిపిస్తున్న వసూళ్ళను చూస్తే తోట కన్నారావు సేఫ్ జోన్ లో పడిపోయాడని టాలీవుడ్ అంటోంది. తోట కన్నారావు కూడా సినిమా కొని చాలా మంచి పనే చేసానని, నా డబ్బులు తిరిగి వచ్చేసాయని ఆనందంగా అతని సన్నిహితుల దగ్గర చెబుతున్నాడని సమాచారం. మరి ఆ కనక వర్షం ఎలా కురిపిస్తోందో 'రోబో" విడుదల పై ప్రియర్ షో ఈ రోజు జెమిని టీవి లో రాత్రి 9గంటకు ప్రసారమయ్యే కార్యక్రమంలో వీక్షించవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X