మగధీరకు ఒక్కడైరెక్టరైతే ‘జగదేకవీరుని’కి ముగ్గురు డైరక్టర్లు!?

By Sindhu

'జగదేకవీరుడు అతిలోకసుందరి" రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకోవడంతో ఆ చిత్ర నిర్మాత అశ్వనీదత్..ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్ ఉంటుందని త్వరలో దానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తాననీ తెలపడంతో ఇప్పుడు ఆ సీక్వెల్ పై రకరాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇంకా హీరో హీరోయిన్లు, దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు వివరాల్ని అశ్వనీదత్ ప్రకటించకపోవడంతో రకరకాల గాసిప్ లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

వీటిలో కొన్ని మచ్చుకకి ఆ చిత్రంలో చిరంజీవి చేస్తే ఈ చిత్రంలో అతని తనయుడు చేస్తాడనేది ఒక గాసిప్ అలాగే ఆ చిత్రంలో నటించిన శ్రీదేవి కూతురు ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వనుందని మరో గాసిప్. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది రాఘవేంద్రరావు అయితే ఈ చిత్రానికి అతని తనయుడు ప్రకాష్ దర్శకత్వం చేయనున్నాడని అది కూడా ప్రక్కన రాఘవేంద్ర రావు పర్యవేక్షణ ఉంటుందని అక్కడక్కడా వినిపిస్తున్నాయి.

అయితే ఈ చిత్రానికి మరో ఇద్దరి దర్శకుల పేర్లు కూడా వినబడుతున్నాయి. వారిలో ఒకరు రామ్ చరణ్ తో చిత్రరికార్డులను నెలకొల్సిన రాజమౌళి అయితే మరో డైరక్టర్ చిరుతో అద్భుత గ్రాఫిక్ కళాఖండాన్ని రూపొందించిన 'అంజి" చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ. ఎప్పటి నుండో వైజయంతీ బ్యానర్ దర్శకుడు రాజమౌళితో ఓ చిత్రం చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. మరీ ఈ మెగా మూవీ అతనినే వరిస్తుంది? లేక 'అరుంధతి" తో సంచలన విజయాన్ని అందించిన కోడి రామకృష్ణకి ఆ అవకాశం వరిస్తుందా? లేదా వీరిద్దరిని కాదని గత చిత్రాన్ని రూపొందించిన రాఘవేంద్రరావుకే ఆ అవకాశం వరిస్తుందో వేచి చూడాలి. వీటన్నింటికీ సమాధానం ఒక్క అశ్వనీదత్ దగ్గరే ఉంది. మరి ఆయన ఈ గాసిప్స్ లో నిజానిజాలెంతో తేలాల్చి ఎప్పుడు వివరాలు వెల్లడిస్తారు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X