AA22 A6 : అల్లు అర్జున్ కోసం ముగ్గురు భామలు.. ఎవరో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా 'పుష్ప2' తో ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారో తెలిసిందే. 2021లో వచ్చిన పుష్ప : ది రైజ్ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ కు పుష్ప 2: దిరూల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్టుగానే పుష్ప2తో అల్లు అర్జున్ కు భారీ సక్సెస్ దక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1870 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో 2వ సినిమాగా రికార్డు నెలకొల్పారు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకనటను కూడా చేశారు. మూవీ భారీ స్థాయిలో ఉండబోతోందని మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన వీడియోను వదిలి కూడా సోషల్ మీడియాను షేక్ చేశారు. అప్పటి నుంచి ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Three Heroines for Allu Arjun and Atlee Upcoming movie

ఇప్పటికే ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిర్మించబోతున్నారని తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు మార్కెట్ లోనూ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో నటించబోయే ఈరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దానిపై తాజగా అప్డేట్ అందింది. ఏకంగా ముగ్గురు హీరోయిన్లు లైన్ లో ఉన్నారని, అందులో ఒకరూ ఫైనల్ అయ్యారని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ మొదలైంది.

మొదట AA22 A6 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా నో అని చెప్పిందని తెలిసిందే. ఆ తర్వాత సమంత రూత్ ప్రభు పేరు లిస్ట్ లోకి వచ్చింది. కానీ తాజాగా వీరిద్దరూ కాకుండా మరో ముగ్గురు బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన దీపికా పదుకొణె కావడం విశేషం. అలాగే జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరిద్దరితో ఇంకా టాక్స్ నడుస్తున్నాయి.

కాగా బాలీవుడ్ బ్యూటీ, సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రం ఈ ప్రాజెక్ట్ లో ఫైనల్ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఆమె తన లుక్ టెస్ట్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ కు సంబంధించిన వివరాలు కూడా రానున్నాయని తెలుస్తోంది. ఏదే మైనా బన్నీ కోసం ముగ్గురు హీరోయిన్లను ఫైనల్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అవెంజర్స్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వంటి చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించిన సంస్థలు ఈ సినిమాకు పని చేస్తుండటం విశేషం. సాయి అభ్యాంకర్ ఈ ప్రాజెక్ట్ కు సంగీతం అందించ బోతున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun atlee mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X