ఎన్టీఆర్ తో 'కత్తి' ...ముగ్గురు స్టార్ డైరక్టర్లు

By Srikanya

హైదరాబాద్: తమిళ చిత్రం 'కత్తి'ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారని,అందులో హీరోగా ఎన్టీఆర్‌ నటిస్తారనే సంగితి తెలిసిందే. ఈ చిత్రానికి ముగ్గురు స్టార్ డైరక్టర్స్ పోటీ పడుతున్నట్లు సమాచారం. వాళ్లు ఎన్టీఆర్ ని గతంలో డైరక్ట్ చేసిన వివి వినాయిక్, హరీష్ శంకర్...మరొకరు..గోపీచంద్ మలినేని. అయితే వివి వినాయిక్ పరిస్ధితికి వస్తే...ఆయన అఖిల్ చిత్రం బిజీలో ఉన్నారు. అది పూర్తైతే కానీ వేరే ప్రాజెక్టుకు రాలేరు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే..హరీష్ శంకర్..ప్రస్తుతం సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తి కావాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. కానీ ఈ సారి ఎన్టీఆర్ కి ఎలాగైనా పెద్ద హిట్ ఇవ్వాలనే ఆలోచనలో హరీష్ ఉన్నారు.

గోపీచంద్ మలినేని విషయానికి వస్తే...ఆయన... రామ్ తో చేస్తున్న పండుగ చేస్కో చిత్రం షూటింగ్ పూర్తైపోయింది. అయితే ఆయన ఇలాంటి హెవీ ఎమోషన్,మెసేజ్ ఉన్న సబ్జెక్టుని ఎంత వరకూ డీల్ చేయగలరు అనేది ప్రశ్నార్దకమే. కానీ ఇమ్మీడియట్ గా ప్రాజెక్టులోకి వెళ్తారు..కాబట్టి ఈ ముగ్గురులో ఒకరికి ఈ సినిమా అందుతుంది కానీ...ఎవరికి అందుతుందనేది తెలియాలి.

Three Star Directors for Kaththi Telugu Remake

విజయ్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కత్తి' తమిళంలో ఘన విజయం సాధించింది. ఆ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చి రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

దీపావళి కానుకగా తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధిచింది. ప్రస్తుతం రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను, కార్పొరేట్ కంపెనీల ఆగడాలను ఈ చిత్రంలో ప్రస్తావించారు. ‘కత్తి' లో... రైతుల కోసం పోరాడే పవర్‍ఫుల్ పాత్రలో విజయ్ అలరించారు. ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇక మురుగదాస్‌ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్‌ టర్మ్‌ మొమొరీ లాస్‌ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్‌', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్‌ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించారు. విజయ్‌, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మించారు. అనిరుథ్‌ స్వరాలు అందించారు.

ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్‌ స్వరాలు అదనపు ఆకర్షణ. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X