విశ్వంభరలో మరో ముగ్గురు హీరోలు.. చిరంజీవి కంటే వాళ్లకే ఎక్కువ
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య కాలంలోనే ఆయన ఎన్నో భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని ప్రాజెక్టులు చేస్తూ వెళ్తున్నారు. ఇలా ఇప్పుడు 'విశ్వంభర' అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఇందులో చిరంజీవి కాకుండా మరో ముగ్గురు హీరోలు కూడా నటిస్తున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
విశ్వంభరగా వస్తున్న చిరు : చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రమే 'విశ్వంభర'. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, ఇషా చావ్లా, అషికా రంగనాథ్‌లు కీలక పాత్రను చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

అంచనాలకు తగ్గట్లుగానే : మెగాస్టార్ చిరంజీవి.. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న 'విశ్వంభర' సినిమాను సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కేటాయించింది. దీంతో దీనిపై హైప్ పెరుగుతూనే వెళ్తోంది.
షూట్ ఎలా సాగుతుంది : మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిషపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు కూడా స్పెషల్ సెట్‌లో షూట్ చేస్తున్నారు.

చిరుకు ముగ్గురు సిస్టర్లు : అత్యధిక బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంభర' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవికి ముగ్గురు సిస్టర్లు ఉంటారట. ఈ పాత్రల కోసం సురభి, ఈషా చావ్లా, అషికా రంగనాథ్‌లను తీసుకున్నారు.
ముగ్గురు హీరోలు కూడా : క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీలో మెగాస్టార్ చిరంజీవికి ముగ్గురు చెల్లెల్లు ఉంటారని ఇప్పటికే చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్లకు జోడీగా ముగ్గురు యంగ్ హీరోలను కూడా తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఈ పాత్రల కోసం ఇప్పటికే దర్శకుడు మల్లిడి వశిష్ట కొంత మంది పేర్లను పరిశీలించినట్లు తాజాగా తెలిసింది.

చిరంజీవి కంటే ఎక్కువ : 'విశ్వంభర' సినిమా సోషియో ఫాంటసీ జోనర్‌లో ముల్లోకాల స్టోరీతో రాబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, అంతకంటే ముఖ్యంగా ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని అంటున్నారు. చిరంజీవి కంటే ఆయన చెల్లెల్లుగా చేస్తున్న ముగ్గురు హీరోయిన్లు, వాళ్లకు జోడీగా చేసే యంగ్ హీరోల పాత్రల నిడివి ఇందులో ఉంటుందని కూడా ఓ షాకింగ్ న్యూస్ లీకైంది.


Click it and Unblock the Notifications











