Thug Life డిజాస్టర్.. శంకర్‌ చాప్టర్ క్లోజ్!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా ఉంది ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో పరిస్థితి. ఎన్నో అంచనాలతో తెరకెక్కి, ఎన్నో వివాదాలకు కారణమైన థగ్‌లైఫ్ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో దాదాపు 38 ఏళ్ల తర్వాత తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత తనను తాను నిరూపించుకోవాలని ఎలాగైనా థగ్‌లైఫ్‌తో హిట్ కొట్టాలని భావించిన కమల్ హాసన్ కలలు కల్లలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి ఏమాత్రం ఆదరణ దక్కడం లేదు.

థగ్‌లైఫ్‌పై దారుణంగా మీమ్స్
అభిరామితో లిప్‌లాక్, త్రిషతో కమల్ హాసన్ రొమాన్స్‌ చేయడం, నాలుగు ఫైట్లు తీయడమేనా సినిమా అంటూ నెటిజన్లు కమల్ హాసన్‌ను ట్రోల్ చేస్తున్నారు. అసలు దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఏమైపోయాడంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడలి, చెలియా, పొన్నియన్ సెల్వన్‌లతో ఇప్పటికే మణిరత్నం ప్రభ మసకబారడం ప్రారంభం కాగా.. థగ్‌లైఫ్‌ దానిని పరిపూర్ణం చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కన్నడలో రిలీజ్ కాకపోవడంతో తాము బతికిపోయామంటూ కన్నడిగులు ఈ సినిమాను ఆడుకుంటున్నారు. తమ భాషపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినందుకు ఈ రకంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు.

Thug Life turned out to be a disaster what is the future of Shankar-Kamal Haasan s Indian 3

కమల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా
థగ్‌లైఫ్ బాక్సాఫీస్ నెంబర్స్ చూస్తే .. మణిరత్నంకు ఫ్యాన్ బేస్ ఉన్న హిందీలో, కమల్ హాసన్‌కు ఫాలోయింగ్ ఉన్న తెలుగులోనూ డిజాస్టర్ దిశగా వెళ్తోంది. ప్రతి పాన్ ఇండియా సినిమాను తాము ఆదరించమని.. సరకు లేకుంటే తిప్పి కొడతామని హిందీ ప్రేక్షకులు బల్లగుద్ధి మరి చెప్పారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకునే తెలుగు ప్రేక్షకుల సహనానికి థగ్‌లైఫ్ పరీక్ష పెట్టింది. నాలుగు రోజుల వరకు ఇండియా వైడ్‌గా రూ.34 కోట్ల నికర వసూళ్లు రాగా.. ఓవర్సీస్‌లో రూ.27 కోట్ల కలెక్షన్స్‌తో కలిపి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.185 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. డివైడ్ టాక్‌కు తోడు, సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో థగ్‌లైఫ్‌ నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

థగ్‌లైఫ్ దెబ్బ మామూలుగా ఉండదా
థగ్‌లైఫ్ ఎఫెక్ట్ ఈ చిత్రంలో పనిచేసిన అందరిపై పడుతోంది. మరీ ముఖ్యంగా ఇండియన్ 2తో తన కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్ అందుకున్నాడని కమల్ హాసన్‌పై ట్రోలింగ్ జరగ్గా.. తాజాగా థగ్‌లైఫ్‌ దానిని బీట్ చేసేలా కనిపిస్తోంది. ఇది కమల్ నెక్ట్స్ మూవీ ఇండియన్ 3పై గట్టి ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు శంకర్‌‌ను కూడా కమల్ ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్‌లు డిజాస్టర్‌లు కావడం, కథ కథనాల్లో మునుపటి దమ్ము లేకపోవడంతో శంకర్ టేకింగ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

Take a Poll

శంకర్‌ను దెబ్బకొట్టిన కమల్ హాసన్
తనను తాను నిరూపించుకునేందుకు ఇండియన్ 3ని ఎలాగైనా హిట్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న శంకర్‌కు పరిస్ధితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. శంకర్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవ్వగా.. ట్రేడ్ వర్గాల్లోనూ ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఇటు శంకర్, అటు మణిరత్నం ట్రాక్ రికార్డులు దిగజారిపోతూ ఇండియన్ 3పై ఉన్న అంచనాలను తలక్రిందులు చేశాయి. ఇప్పట్లో థగ్‌లైఫ్ చేసిన గాయం మానిపోయే సూచనలు కనిపించకపోవడంతో సినిమా విడుదలను ఆలస్యం చేయడమో లేదంటే మంచి రేట్‌కి ఏ ఓటీటీ సంస్థకైనా అమ్మేసి నేరుగా ఓటీటీ రిలీజ్ చేస్తే మంచిదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి థగ్‌లైఫ్ దెబ్బతో కమల్ హాసన్ .. శంకర్ కెరీర్‌ను కూడా ఎండింగ్ స్టేజ్‌కి తీసుకొచ్చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: thug life kamal haasan indian 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X