RC16: రామ్ చరణ్ మూవీలో టైగర్.. అందుకే ఆ స్టార్‌ను తీసుకున్నారా!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు హీరోల రేంజ్ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిపోయారు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. కొంత కాలంగా వరుసగా హిట్లను అందుకుంటోన్న అతడు.. RRR మూవీతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదును కూడా దక్కించుకున్నాడు. దీంతో యమ జోష్‌తో వెళ్తున్నాడు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమా పూర్తి కాకుండానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో అనౌన్స్ చేశాడు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కించబోయే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్.. శంకర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఇది మొదలయ్యే చాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమాలో ఎంతో మంది బడా యాక్టర్లు భాగం కాబోతున్నారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన లయను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని, విలన్‌గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని ఇప్పటికే న్యూస్ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కాకుండా బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌ను తీసుకున్నారని తెలిసింది. ఇది స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న నేపథ్యంలో హీరోకు సమానమైన ఏజ్ ఉన్న హీరోనే తీసుకోవాలని అనుకున్నారట. అందుకే టైగర్‌తో డైరెక్టర్ చర్చలు జరిపాడని సమాచారం. దీనికి ఈ స్టార్ వెంటనే ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. అతడి ఎంపిక గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇవ్వబోతున్నారు.


Click it and Unblock the Notifications











