టైటిల్ మరీ ఓవర్...ఎన్టీఆర్ కు బాగుండేది

By Srikanya

హైదరాబాద్: కొన్ని టైటిల్స్ కొందరికి కరెక్టుగా యాప్ట్ అన్నట్లుగా ఉంటాయి. అయితే మరికొన్ని ఏదో వెటకారం చేసినట్లుగా ఉంటాయి. తాజాగా సందీప్ కిషన్ కొత్త చిత్రానికి టైగర్ అనే టైటిల్ అని పెట్టిన సంగతి తెలిసిందే. మురుగదాస్ అశోసియేట్ ఆనంద్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. సందీప్ కిషన్ కు టైగర్ అనే టైటిల్ పెట్టడమేంటి...ఏ ఎన్టీఆర్ సినిమాకో పెడితే అర్దముంది కానీ...అంటున్నారు. ముఖ్యంగా బోయ్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ తెచ్చుకున్న సందీప్ కు ఇది ఎంతవరకూ సూట్ అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందు చిత్రం జోరు లోనూ ఇలాగే కాస్త ఓవర్ గా లార్జర్ దేన్ లైఫ్ తరహా పాత్ర చేసి బోల్తా పడ్డ విషయం అప్పుడే మరిచిపోయాడా అని చెప్పుకుంటున్నారు. మరి సందీప్ కిషన్ ఈ విషయమై ఏమంటాడో చూడాలి. ఎప్పటిలాగే మీకు ఆ టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్దమవుతుంది అంటాడేమో.

చిత్రం విషయానికి వస్తే...

ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, ‘ఠాగూర్‌' మధు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘టైగర్‌'. ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలో సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తున్నారు. తమిళదర్శకుడు మురుగదాస్‌ శిష్యుడు వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ మంగళవారం వారణాసిలో మొదలైంది. సీరత్‌ కపూర్‌(రన్ రాజా రన్) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి (మాటలు), ఛోటా కె.నాయుడు(ఛాయాగ్రహణం), తమన్‌ (సంగీతం) వంటి టాప్‌ టెక్నీషియన్స్‌ పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత ఎన్‌.వి. ప్రసాద్‌ మాట్లాడుతూ ‘గంగానది నేపథ్యంలో సాగే విభిన్న కథాచిత్రమిది, వారణాసి, అలహాబాద్‌, రాజమండ్రి, వైజాగ్‌, హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంది. వారణాసిలో పది రోజుల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. హీరోగా సందీప్‌కిషన్‌ స్థాయి పెంచే సినిమా అవుతుంది' అని తెలిపారు.

Tiger – Too heavy for Sundeep Kishan?

రాహుల్‌ రవీంద్ర, సప్తగిరి, సుప్రీత్‌, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్‌, ప్రవీణ్‌, కాశీ విశ్వనాథ్‌ తదితరులు నటించే ఈ చిత్రానికి ఎడిటింగ్‌: ఛోటా కె. ప్రసాద్‌, ఫెట్స్‌: వెంకట్‌, కళ: రాము, లైన్‌ ప్రొడ్యూసర్‌: జి.నాగేశ్వరరావు, సమర్పణ: ‘ఠాగూర్‌' మధు.

ఇక రీసెంట్ గా సందీప్ కిషన్ జోరు అనే డిజాస్టర్ ని ఇచ్చారు. అందులోనూ ఆయన నేల విడిచి సాము చేసాడు. ఏదో పెద్ద హీరోలు చేద్దామన్నట్లు ట్రై చేసి బోల్తా పడ్డాడు అని చెప్పుకున్నారు. అయితే అంతా ఒప్పుకునే విషయం మాత్రం సందీప్ కిషన్ లో విషయం ఉన్న నటుడు...సరైన కథ,దర్శకుడు పడితే దున్నేస్తాడు అని.

నటుడిగా, హీరోగా కెరీర్ ఆరంభం నుండి ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న యువ హీరో సందీప్ కిషన్. ప్రయోగాత్మక సినిమాలకు కమర్షియల్ అంశాలు జోడిస్తూ వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. తాజాగా మరో ఆసక్తికరమైన టైటిల్ తో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

‘నా ఊపిరి' ఫేం కన్మణి దర్శకత్వంలో సందీప్ కిషన్ నటిస్తున్న సినిమాకు ‘బీరువా' అనే టైటిల్ ఖరారు చేశారు. సంజుగాడి ఫ్రెండ్ అనేది ఉప శీర్షిక. రెండు ప్రతిష్టాత్మక సంస్థలు ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఉషా కిరణ్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నవంబర్ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని సందీప్ కిషన్ తెలియజేశారు. యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకోస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సినిమాలో ‘బీరువా' ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని దర్శకుడు తెలిపారు.

సందీప్ కిషన్ సరసన సురభి హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ తమన్ ఫస్ట్ టైం సందీప్ కిషన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X