'పవర్' ఆఫర్ కొట్టేసిన టిల్లు బ్యూటీ .. ఏకంగా పవన్ తో రొమాన్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్స్ మంచి ఫేమ్‌ని యిట్టె తెచ్చుకుంటున్నారు. అయితే ఈ హీరోయిన్స్‌లో ఒక నటిగా కాకుండా వారు చేసిన పాత్రలు గుర్తుండిపోవడం అనేది కొంచెం అరుదుగానే జరుగుతుంది. ఇపుడు ఉన్న యంగ్ హీరోయిన్స్ లో ఒక్క హీరోయిన్ మాత్రం కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టి ఓ రేంజ్‌లో ఫేమ్ తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు కన్నడ నటి నేహా శెట్టి అని చెప్పాలి.

తన ఎంట్రీ టాలీవుడ్ లో సింపుల్ గానే ఇచ్చినప్పటికీ తన కెరీర్ లో బ్రేకింగ్ సినిమా మాత్రం "డీజే టిల్లు" అని చెప్పాలి. ఈ సినిమాలో హీరో సిద్ధూ జొన్నలగడ్డ చేసిన టిల్లు రోల్ కూడా టాలీవుడ్‌లో ఎంత క్లిక్ అయ్యిందో తన పాటుగా రాధికగా నేహా శెట్టి కూడా ఫేమస్ అయ్యిపోయింది. అక్కడి నుంచి తన హాట్ షో మాత్రమే కాకుండా నటిగా కూడా మిడ్ రేంజ్ సినిమాలు చేస్తుంది. కానీ ఇపుడు ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ లో క్రేజీ ఆఫర్ ని కొట్టేసినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

tillu beauty neha shetty got a power offer in pawan movie

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టుగా ఫిలింనగర్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ సినిమా కూడా పవన్ కెరీర్‌లోనే భారీ అంచనాలు ఉన్న చిత్రం "ఓజి" అట. పవన్ కళ్యాణ్, సాహో ఫేం సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఈ యంగ్ అండ్ హాట్ బ్యూటీ స్పెషల్ ఐటెం సాంగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇపుడు నడుస్తున్న బ్యాంకాక్‌ షెడ్యూల్‌లోనే ఈమెపై అక్కడే ఈ సాంగ్ ని మేకర్స్ చేస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. అయితే పవన్ ఈ సినిమా షూటింగ్ లో లేరని తెలిసిందే. సో పవన్ తో ఈమెకి స్క్రీన్ స్పేస్ లేదనే చెప్పాలి. బహుశా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీతో ఈ సాంగ్ ఉండి ఉండొచ్చు అని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ హిట్ బ్యూటీ ప్రెజెన్స్ సినిమాలో ఉన్నట్టే తెలుస్తుంది.

tillu beauty neha shetty got a power offer in pawan movie

మరి చూడాలి ఈమె కేవలం ఇమ్రాన్ తోనే ఉంటుందా అనేది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యువ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నటులు శ్రేయ రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తుండగా ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు షూటింగ్‌లో జాయిన్ అవుతారా అని మేకర్స్ చూస్తున్నారు. తన డేట్స్ ఇస్తే ఓజి కంప్లీట్ చేసేసి వచ్చే ఏడాది రిలీజ్‌కి తీసుకురానున్నారు. చూడాలి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్‌కి వస్తుంది అనేది.

More from Filmibeat

Read more about: pawan kalyan og neha shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X