రంభ రీ ఎంట్రికి రంగం సిద్దం, డిటేల్స్
'గుమ్కీ' విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత దర్శకుడు డి.ఇమాన్ స్వరాలు సమకూర్చనున్నాడు. నేశన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. మే మొదటి వారంలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూపర్‌గుడ్ ఫలింస్ కోసం విజయ్ తన పారితోషికాన్ని కొంచెం తగ్గించుకున్నాడని సమాచారం.
రంభ ఆ మధ్య ఓ తెలుగింటి కెనడా బిజీనెస్ మాన్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక పాపకు తల్లి అయింది. ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించిన నటి రంభ. మొదట హీరోయిన్ గా చెలామనియైన రంభ, తర్వాత యువ హీరోల చిత్రంలో ఐటం సాంగ్ లలో నటించిన రంభ, ఆ తర్వాత సినిమాలు చేయడం ఆపేసింది. అయితే ఇపుడు మళ్లీ ఎంట్రీ ఇస్తే కథానాయికపాత్రలు దొరక్కపోయినా, ఇప్పటికి కత్తిలా కనిపించే రంభ ఐటం సాంగ్ లకు కూడా రెడీ అంటోంది.
కథకు అవసరమైన మంచి పాత్రలు దొరుకుతాయనే నమ్మకంతో మళ్లీ రే ఎంట్రీ ఇస్తానంటోంది. పనిలో పనిగా నిర్మాతగా కూడా మారి, లోబడ్జెట్ చిత్రాలు తీయాలని ఉబలాటపడుతోంది. ఇలా రంభ నటిగా, నిర్మాతగా అవతారం దాల్చి మనముందుకు మళ్లీ రాబోతోంది. దాంతో అభిమానులు రంభ కోసం ఎదురు చూపులు చూస్తున్నారట. దీనికోసం రంభ తన పాత దర్శకులతో పాటుగా నేటి యువ దర్శకులతో కూడా టచ్ లో ఉంటుందట. త్వరలోనే ఓ మంచి సినిమాతో తెలుగులోనూ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications












