మహేష్,పూరీ కాంబినేషన్ చిత్రం టైటిల్
హైదరాబాద్ : మహేష్ బాబు, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టపోరి టైటిల్ నే పెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇద్దరు అమ్మాయిలు చిత్రం బిజీలో ఉన్న పూరీ మరో ప్రక్క ఈ చిత్రానికి సంభందించిన స్క్రిప్టు పూర్తి చేసి, మహేష్ కు వినిపించారు. పూర్తి బౌండ్ స్క్రిప్టుకు ఇంప్రెస్ అయిన మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2013 చివరలో ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. ఈ లోగా బండ్ల గణేష్..ఇద్దరు అమ్మాయిలతో,బాద్షా చిత్రాలు విడుదల చేస్తారు.
ఇక మహేష్ బాబు, క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కలయిక అంటే...ఆ చిత్రం తెలుగు సినిమా రికార్డులను తిరగరాసేలా విజయం సాధించడం ఖాయం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి', 'బిజినెస్ మేన్' చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధించాయో కొత్తగా చెప్పక్కర్లేదు.
బండ్ల గణేష్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆవెంటనే మహేష్ బాబు సినిమా చేసే అవకాశం అతనికి దక్కడంపై పరిశ్రమలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. హీరోకి, దర్శకుడికి గణేష్ భారీ అమౌంట్ ఆఫర్ చేసి ఈ అవకాశం దక్కించుకున్నాడని అంటున్నారు. వీరి కాంబినేషన్ సినిమా అంటే తప్పకుండా హిట్ అవుతుంది. ఒక వేళ అంచనాలు తలక్రిందులైనా పెట్టిన పెట్టుబడి గ్యారంటీగా తిరిగి వస్తుందనే నమ్మకంతో వారికి భారీగా ఆఫర్ చేసినట్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












