వెంకటేష్, నాగ చైతన్య మల్టీస్టారర్ సినిమాకు టైటిల్ ఖరారు !
తాజా సమాచారం మేరకు నాగ చైతన్య, వెంకటేష్ సినిమాకు ''వెంకి మామా'' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ టైటిల్ నే ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జనార్ధన్ మహర్షి కథ అందించిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన హ్యూమా ఖురేషి ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో నాగ చైతన్య తో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో చైతు సరసన నటిస్తోంది. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం ఉండబోతుందని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరు కలిసి చూసే విధంగా సినిమాను బాబీ రూపొందించబోతున్నాడని సమాచారం.

ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు మారుతి దర్శకత్వంలో శైలజ రెడ్డి అల్లుడు మూవీలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత బాబి సినిమాలో నటించబోతున్నాడు చైతు. వెంకటేష్ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











