రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చకు ఫుల్ స్టాప్ పడి.. ప్రస్తుతం కథేంటి? టైటిల్ ఏంటి? దర్శకుడు రాజమౌళి తీయబోయే సినిమాకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ను ఎంచుకోవడంతోనే తన సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా మల్టీస్టార్ కి కొత్త నిర్వచనం ఇస్తుందని సినీ వర్గాల్లో టాక్. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ఈ సినిమాకు ఎంత బడ్జెట్? టైటిల్ తదితర అంశాలపై భారీగా చర్చ జరుగుతోంది.

కథేంటి? టైటిల్ ఏంటి?
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తీస్తున్న భారీ మల్టీస్టార్ ఫై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చకు ఫుల్ స్టాప్ పడి.. ప్రస్తుతం కథేంటి? టైటిల్ ఏంటి? ఎంత బడ్జెట్? టైటిల్ తదితర అంశాలపై భారీగా చర్చ జరుగుతోంది.

అక్టోబర్ నుండి ఈ సినిమా
దర్శకుడు రాజమౌళి తీయబోయే సినిమాకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ను ఎంచుకోవడంతోనే తన సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా మల్టీస్టార్ కి కొత్త నిర్వచనం ఇస్తుందని సినీ వర్గాల్లో టాక్. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆగష్టు నుండి సినిమాకు సంభందించిన కాస్టింగ్ మొదలవుతుందని సమాచారం.

అధికారికంగా ప్రకటించే వరుకు ఆగాలి
తాజాగా ఈ సినిమా గురించి బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే... ఈ మూవీకి ఇద్దరూ ఇద్దరే అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు చేసే పాత్రలు సమానమైనవి ఎవ్వరికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా రాజమౌళి వారి పాత్రలను తీర్చిదిద్దడం జరిగిందని సమాచారం. టైటిల్ విషయంలో అధికారికంగా ప్రకటించే వరుకు రూమర్స్ ను నమ్మలేము.

ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్, చరణ్
తాజాగా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వీరిద్దరూ రాజమౌళి సినిమా పనిమీదే అమెరికా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ - చరణ్‌లపై ఫోటో షూట్ జరిగినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చరణ్ బ్రదర్స్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అన్నయ్యగా ఎన్టీఆర్, తమ్ముడిగా చరణ్ కనిపించనున్నారనేది తాజా సమాచారం.


Click it and Unblock the Notifications











