బిచ్చగాడి క్యారెక్టర్ అనడంతో.. కుబేరా సినిమాను వదిలేసిన టాలీవుడ్ స్టార్.. ఎవరో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 2వ సారి తెలుగు ప్రొడక్షన్ హౌజ్ లో నటించిన చిత్రమే 'కుబేరా'. గతంలో సార్ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇక కుబేరా చిత్రం జూన్ 20న ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంతో పాటు ధనుష్ పోషించిన బిచ్చగాడి పాత్రకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే ధనుష్ కంటే ముందు ఈ చిత్రం టాలీవుడ్ లో మరొక హీరో చేయాల్సి ఉండింది.ముందుగా ఈ కథ ఆయన దగ్గరకే వెళ్లిందని, కానీ అతను రిజెక్ట్ చేయడంతో ధనుష్ రంగంలోకి దిగారంటూ తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

కుబేరాకు దక్కుతున్న ఆదరణ..
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. క్రైమ్ జోనర్ లో రూపుదిద్దుకున్న ఈచిత్రంలో వ్యాపార వేత్తలు, బ్లాక్ మనీ చుట్టూ కథ తిరిగుతుంది. బడా వ్యాపార వేత్తలు నల్ల ధనాన్ని ఎలా తమ అకౌంట్లలోకి మార్చుకోవాలని ప్రయత్నించారనే నేపథ్యంతో సినిమా కథ నడుస్తుంది. ఇందులో ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో నటించిన ధనుష్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు. ధనుష్ డిఫరెంట్ అప్టెంట్ ఆడియెన్స్ బాగా నచ్చింది.

Tollywood Actor Rejected Dhanush Sekhar Kammula s Kuberaa movie Why

కుబేరా చిత్రాన్ని వదులుకున్న టాలీవుడ్ స్టార్..
తొలుత కుబేరా చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ హీరోతో చేయాలని అనుకున్నారంట దర్శకుడు శేఖర్ కమ్ముల. కథ కూడా వినిపించాడని, కానీ బిచ్చగాడి పాత్ర కావడంతో తనకు సెట్ అవ్వదని వదిలేశాడంట. కానీ ఇప్పుడు కుబేరా చిత్రంలో ఆ పాత్రకే మంచి స్పందన దక్కుతుండటం విశేషం. ఇక బిచ్చగాడి పాత్రలో ధనుష్ ప్రశంసలు అందుకుంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని మొదటగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో చేయాలని అనుకున్నారంట. కానీ విజయ్ కు ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆ సినిమా కథ, పాత్ర సెట్ అవ్వవదని అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ఈ మేరకు వార్త చక్కర్లు కొడుతోంది.

భారీ బడ్జెట్ తో కుబేరా చిత్రం..
కుబేరా చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ బ్యానర్ లో నిర్మించారు. సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల రూ.120 కోట్లు వెచ్చించి రూపొందించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రను పోషించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా అలరించింది. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం.

వరుసగా తెలుగు చిత్రాలతోనే..
తమిళ స్టార్ ధనుష్ ప్రస్తుతం డైరెక్ట్ గా తెలుగు చిత్రాల్లోనే నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ధనుష్ సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. సార్, కుబేరా వంటి చిత్రాల తర్వాత నెక్ట్స్ తెలుగులో ఏ సినిమాలో నటిస్తారనేది చూడాలి.

More from Filmibeat

Read more about: Kuberaa dhanush vijay deverakonda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X