twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    VK Naresh ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. పవిత్ర లోకేష్ ఎంట్రీతో షాకింగ్ విషయాలు!

    |

    టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న విజయ నిర్మల వారసుడు ఒకప్పటి హీరో VK నరేష్ ఇటీవల ఊహించని విధంగా ఒక వివాదంలో హైలెట్ అయిన విషయం తెలిసిందే. మరో ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో ఆయనకు ఎఫైర్ ఉందని నరేష్ మూడవ భార్య ఇటీవల పలు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం అందరినలకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక నరేష్ ఆస్తులు ఎంత ఉంటాయనే విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    హోటల్ లో పట్టుబడిన జంట

    హోటల్ లో పట్టుబడిన జంట

    నరేష్ మూడవ భార్య ఆరోపణలతో నరేష్ , పవిత్ర మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల నరేష్ పవిత్ర ఇద్దరు కూడా హోటల్ లో ఉండగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీడియా ముందు పలు రకాల వ్యాఖ్యలు కూడా చేశారు.

    విడాకులు ఇవ్వకముందే..

    విడాకులు ఇవ్వకముందే..

    నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకోవడానికి సిద్దమైనట్లు ఆమె ఆరోపణలు చేసింది. దీంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే నరేష్ ఎప్పటికప్పుడు ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆ తరువాత ఆ వివాదం ఏ మాత్రం చల్లారలేదు.

    నరేష్ రెమ్యునరేషన్ ఎంత?

    నరేష్ రెమ్యునరేషన్ ఎంత?

    అయితే ప్రస్తుతం నరేష్ కు సంబంధించిన ఆస్తుల వ్యవహారం పై కూడా అనేక రకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతను ఒక్కో సినిమాకి రోజుకు లక్షల్లోనే రెమ్యునరేషన్ అందుకుంటూ ఉన్నాడు. మొత్తంగా ఒక్కో సినిమాకు నరేష్ 20 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో టోటల్ కాల్షీట్స్ ద్వారా ఆదాయం అందుకుంటున్నట్లు సమాచారం.

     విజయ నిర్మల ఆస్తి

    విజయ నిర్మల ఆస్తి

    అసలు మొత్తంగా నరేష్ కు ఏ రేంజ్ లో ఆస్తులు ఉన్నాయి అనే విషయంలో కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా నరేష్ కు ఉన్న అస్తిలో సగానికి పైగా వారి అమ్మగారు విజయనిర్మల నుంచి వచ్చిందట. ఆమె అప్పట్లోనే చెన్నైలో విలువైన ప్రాంతాల్లో భూములు కొన్నారని వాటి విలువ ఇప్పట్లో వందల కోట్లు ఉంటుందని సమాచారం.

    హీరోగా మంచి ఆదాయం

    హీరోగా మంచి ఆదాయం

    నరేష్ కు కూడా మొదట ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక అతని స్టార్ హోదా ఉన్నన్ని రోజులు మంచి రెమ్యునరేషన్ అందుకొని కొన్ని ఆస్తులు కూడా కూడా సంపాదించుకున్నాడు. హీరోగా మార్కెట్ కోల్పోయిన అనంతరం కూడా ఆయన మంచి సహా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    మొత్తం ఆస్తి ఎంతంటే?

    మొత్తం ఆస్తి ఎంతంటే?

    ఇక నరేష్ కు హైదరాబాద్ పతిసర ప్రాంతంలోనే ముందే సంపాదించుకున్న కొన్ని ఫ్లాట్స్ అలాగే సిటీకి సమీపంలో కొన్ని ఫామ్ హౌస్ లు ఉన్నాయట. అలాగే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల ద్వారా భారీగానే సంపాదించినట్లు సమాచారం. ఖరీదైన మూడు కార్లు కూడా ఉన్నాయట. మొత్తంగా నరేష్ ఆస్తి విలువ రూ.300కోట్లకు పైనే ఉంటుందని ఒక టాక్ అయితే వస్తోంది.

    English summary
    Tollywood Actor VK Naresh total assets value and remuneration per movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X