ఆర్తి అగర్వాల్ బయోపిక్.. మోసం నుంచి మరణం వరకు.. ఓటీటీ ప్లాన్?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ అనే మాట చాలా కామన్ గా మారిపోయింది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు జనాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. క్రేజ్ తో పాటు లాభాలు కూడా గట్టిగానే ఉంటాయని సినిమా వాళ్ళు బయోపిక్స్ అనే కాన్సెప్ట్ లను చా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. ఇక ఓటీటీని అందుకు ఒక ఆయుధంలా వాడుతున్నారు. త్వరలోనే ఆర్తి అగర్వాల్ బయోపిక్ కూడా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

15ఏళ్ళ క్రితం ఒక స్టార్ హీరోయిన్ గా..

15ఏళ్ళ క్రితం ఒక స్టార్ హీరోయిన్ గా..

ఆర్తి అగర్వాల్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 2015లో ఆమె అకస్మాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే 15 ఏళ్ల క్రితం ఆమె ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ హీరోయిన్. అప్పటివరకు ఉన్న స్టార్ హీరోయిన్స్ కి మొదటి సినిమాతోనే ఊహించని కౌంటర్ ఇచ్చింది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని రకాల సినిమాలు చేసింది. ఆర్తి అగర్వాల్ నటనకు కూడా థియేటర్స్ లో అప్పట్లో స్పెషల్ విజిల్స్ పడేవి.

స్టార్ హీరోలందరితో..

స్టార్ హీరోలందరితో..

అందం, అభినయం, చురుకుదనం కలగలిపిన ఆర్తి అగర్వాల్ దాదాపు స్టార్ హిరోలందరితో వర్క్ చేసింది. మొదట 2001లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత అతికొద్ది కాలంలోనే మెగాస్టార్, బాలక్రిష్ణ, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఓ వైపు పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి యువ హీరోలతో కూడా నటించింది.

 కొన్నాళ్ళ పాటు ఎవరికి కనిపించకుండా

కొన్నాళ్ళ పాటు ఎవరికి కనిపించకుండా

అయితే మెల్లగా కెరీర్ లో అవకాశాలు తగ్గిన అనంతరం ఆమె పెళ్లి చేసుకొని ఫ్యామీలి లైఫ్ ని ఎంజాయ్ చేయాలని అనుకుంది. 2007లో ఉజ్వల్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ అతనితో 2009లోనే ఆర్తి విడాకులు తీసుకుంది. అనంతరం కొన్నాళ్ళ పాటు ఎవరికి కనిపించకుండా ఉండాలని ఆమె అమెరికాకు వెళ్లిపోయింది.

 ఫెయిల్ అవ్వడంతో..

ఫెయిల్ అవ్వడంతో..

అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే హీరోయిన్ గా మళ్ళీ ఎలాగైనా బిజీ అవ్వాలని ఆమె తొందరగా బరువు తగ్గడానికి లైఫో సర్జరీ చేయించుకుంది. కానీ అది ఫెయిల్ అవ్వడంతో ఆర్తి అగర్వాల్ హఠాత్తుగా మరణించింది. అప్పట్లో ఆ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది.

Recommended Video

Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
ఓటీటీలో బయోపిక్

ఓటీటీలో బయోపిక్

ఇక చాలా రోజుల తరువాత ఆర్తి అగర్వాల్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమెపై ఒక యువ దర్శకుడు సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలోనే రిలీజ్ చేసే విధంగా చిన్న బడ్జెట్ లోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కథలో ఆర్తి అగర్వాల్ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలని, ఆమెకు జరిగిన మోసాన్ని అలాగే ఎలా మరణించింది అనే విషయాలని మాత్రమే చూపించనున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X