పెళ్లి, పిల్లల తర్వాత.. బోల్డ్ రోల్స్ లో కాజల్ అగర్వాల్.. ఏ సినిమా అంటే?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్నేళ్ల పాటు ఊపూపిన సంగతి తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల జోరును తగ్గించింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ, పిల్లలు కారణంగా కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కెరీయర్ పై ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్సింగ్ ను మొదలు పెట్టింది. ఈ క్రమంలో తాజాగా తనకు రాబోయే చిత్రాల గురించి కీలక నిర్ణయాలను తీసుకుందని తెలుస్తోంది.
కాజల్ అగర్వాల్ తెలుగు హిట్ సినిమాలు..
బాంబేలో పుట్టి పెరిగిన కాజల్ అగర్వాల్ 19 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. 2004 నుంచి కాజల్ అగర్వాల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. తెలుగు, తమిళం, హిందీలో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. 2007లో లక్ష్మి కళ్యాణం, చందమామ వంటి చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తన నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దాంతో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందాయి. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవి తేజ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. మగధీర, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మెన్, బాద్షా, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం.150, భగవంత్ కేసరి, ఇండియన్ 2 వంటి చిత్రాలతో గుర్తుండిపోయేలా చేసింది.

కాజల్ అగర్వాల్ కీలక నిర్ణయం..
సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020లోనే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. 2022లో కొడుకు నీల్ కిచ్లుకు జన్మనిచ్చింది. ఇక పెళ్లి, పిల్లల తర్వాత కూడా సినీ పరిశ్రమలో తన కెరీయర్ ను కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం పూర్తిగా సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టాలని చూస్తోంది. మరోవైపు కీలక నిర్ణయం తీసుకుందని ఫిల్మ్ సర్కిల్స్ తో చర్చ జరుగుతోంది. కాజల్ అగర్వాల్ త్వరలో దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. డైరెక్టోరియల్ డెబ్యూకు సద్ధమైందని చర్చ కొనసాగుతోంది. అంతే కాదు నెక్స్ ప్రకటించబోయే చిత్రానికి దర్శకత్వంతో పాటు లీడ్ రోల్ లో తనే నటించబోతుందని అంటున్నారు. దీనిపై ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.
బోల్డ్ పాత్రలకు కూడా ఓకే..
ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు బోల్డ్ పాత్రల్లో నటిస్తూ షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇలియానా, తమన్నా, టబు వంటి స్టార్ బ్యూటీలు బోల్డ్ గా షాక్ ఇచ్చారు. ఇదే తరహాలో కాజల్ అగర్వాల్ కూడా బోల్డ్ రోల్ లో మెరియబోతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా స్పష్టమైన అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
కన్నప్పతో పార్వతీగా..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రంలో కాజల్ అగర్వాల్ పార్వతీ పాత్రలో దర్శనమివ్వనుంది. చివరిగా భగవంత్ కేసరి, సత్యభామ చిత్రాలతో అలరించింది. ఇక కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కాజల్ 'ది ఇండియా స్టోరీ', 'ఇండియన్ 3', 'రామయణ : పార్ట్ 1' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











