హోళీ పార్టీలో తెలుగు హీరోయిన్‌పై అయిఘాత్యం!
హైదరాబాద్: సినిమాల్లో హాట్ అండ్ సెక్సీ అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే హీరోయిన్లు...పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అభిమానం పేరుతో వారిని చుట్టు ముట్టి వారి పట్ల అసభ్యమైన చర్యలకు పాల్పడే నీచబుద్ది గల ఆకతాయిలకు కొదవలేదు. గతంలో షాపు ఓపెనింగులకు హాజరైన పలువురు హీరోయిన్లు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు.
తాజాగా తెలుగులో పాపులర్ అయిన ఓ హీరోయిన్ (ఇతర రాష్ట్రానికి చెందిన భామ) ఇటీవల ఓ హోటల్‌లో జరిగిన హోళీ సంబరాల్లో పాల్గొందని, ఈ సందర్భంగా ఆమెపై కొందరు యువకులు రంగులు చల్లే నెపంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఆమెను టచ్ చేస్తూ ఇబ్బంది పెట్టారని సమాచారం.

ఈ పరిణామాలతో షాకైన ఆమె వెంటనే తన సిబ్బంది సహాయంతో హోటల్ రూంలోకి వెళ్లి వారి బారి నుండి తప్పించుకుందని, ఈ హోళీ పార్టీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా కల్పించుకోవడంతో గొడవ సద్దుమనిగిందని తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై సదరు హీరోయిన్ గానీ, నిర్వాహకులు గానీ ఎవరికీ కంప్లైంట్ చేయక పోవడం గమనార్హం.
దీంతో ఇకపై ఎప్పుడూ ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్లకు హాజరు కావద్దని సదరు హీరోయిన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏదైన ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చినా.....బౌన్సర్లతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తే తప్ప వెళ్లే ప్రసక్తే లేదని డిసైడయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఇతర హీరోయిన్లను కూడా జాగ్రత్త పడేలా చేసింది.


Click it and Unblock the Notifications