Pragathi: యాక్టర్ ప్రగతికి మళ్లీ పెళ్లి.. కాబోయే వరుడు ఎవరంటే?
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం, అభియానికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తొలుత హీరోయిన్ గా సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అనేక చిత్రాల్లో అక్కగా, అమ్మగా, వదినగా, మరదలుగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఈ సీనియర్ నటి ప్రస్తుతం సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా దర్శనం ఇస్తోంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ముఖ్యంగా జిమ్ లో ఆమె చేసే కసరత్తులను వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో పోస్ట్ చేస్తుంటుంది. ప్రగతి ఆంటీకి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో ఫుడ్, హెల్త్, బ్యూటీకి సంబంధించిన టిప్స్ గురించి చెబుతుంటుంది. ఆమె ఫాలో అయ్యే వాటిని చూపిస్తుంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తుంటుంది. అందుకే ఈమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సింగిల్ మదర్ గా జీవితం సాగిస్తున్న ఈమె గురించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

చిన్నతనంలోనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రగతి. వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య వచ్చిన గొడవల కారణంగా విడిపోయారు. భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ప్రగతి పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇదంతా జరిగి 26 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఈమె ఒంటరిగానే పిల్లలను చదివిస్తూ.. సినిమాల్లో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అయితే తాజాగా ఈమె రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాతను.. ప్రగతి పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే చాలా మంచి వ్యక్తి అయిన ఆ టాప్ ప్రొడ్యూసర్ యే.. ప్రగతి వద్దకు వెళ్లి పెళ్లి ప్రపోజల్ పెట్టాడట. ఆయన వ్యక్తిత్వంతో పాటు ఆయన అడిగిన తీరు నచ్చిన ప్రగతి అతిడితో పెళ్లికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఆమె రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందని అంతా అంటున్నారు.

గతంలో ఈమె రెండో పెళ్లిపై చేసిన కామెంట్లలో.. తనకు తగ్గ వాడు దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం తనకు నచ్చిన వాడు దొరకడం వల్లే రెండో పెళ్లికి ఆమె సిద్ధం అయిందంటూ నెటిజెన్లు వివరిస్తున్నారు. మరికొందరు అయితే ఇంకెంత కాలం ఒంటరిగా జీవిస్తుందని, సింగర్ సునీతలాగే ఈమె కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇటు ప్రగతి కానీ, అటు టాప్ ప్రొడ్యూసర్ కానీ స్పందిస్తే తప్ప అసలు విషయం తెలిసేలా లేదు. చూద్దాం మరి. ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











